లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

టిక్ టాక్ స్టార్ ఆత్మహత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

Published

on

nellore tiktok star harassed ,ends life, due to love affair : యువతితో ప్రేమ వ్యవహారం ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. చివరికి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే స్ధాయికి వెళ్లింది. నెల్లూరులోని రంగనాయకులు పేట, పెద్ద తోట ప్రాంతంలో నివసించే రియాజ్‌ బాషా చిన్న కుమారుడు రఫీ (23) ఈవెంట్స్‌కు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.

నారాయణరెడ్డి ప్రాంతానికి చెందిన ముస్తఫా, రఫీ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి సరదాగా టిక్ టాక్ వీడియోలు తీస్తూ హ్యాపీ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, ముస్తఫా ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇది రఫీకి కూడా తెలుసు. అయితే ఆ యువతి రఫీతో చనువుగా ఉండసాగింది. ఇది ఇద్దరి స్నేహితుల మధ్య గొడవకు దారి తీసింది.

జనవరి 20న రఫీ , యువతిని తీసుకుని టీ తాగేందుకు మనుబోలు వెళ్లాడు. ఆ సమయంలో ముస్తఫా ఆయువతికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు.రఫీతో కలిసి మనబోలులో ఉన్నానని చెప్పింది ఆయువతి. ఇద్దరూ కలిసి నాలుగవ మైలు దగ్గరకు రావాలని చెప్పాడు. టీ తాగీన తర్వాత రఫీ, యువతి ఇద్దరూ కల్సి నాల్గవ మైలు వద్ద ఉన్న అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు.

అక్కడే ఉన్న ముస్తఫా రఫీ పై దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన రఫీని అతని తండ్రి రియాజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకుని 21వ తేదీన నెల్లూరు రూరల్ పోలీసులకు ముస్తఫా పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ఫ్రారంబించారు.

తనపై పోలీసు కేసు పెట్టినట్లు తెలుసుకున్న ముస్తఫా రఫీని బెదిరించ సాగాడు. కేసు వాపస్ తీసుకోకపోతే రఫీకి సంబంధించిన పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో జనవరి 22శుక్రవారం రాత్రి రఫీ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే రఫీ ప్రాణాలువదిలినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.