శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అయోధ్య కాదని తమ దక్షిణ నేపాల్ అయోధ్యపురిలోనే శ్రీరాముడి జన్మించాడని వ్యాఖ్యానించారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై నేపాల్ ప్రధాని రెండోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే.మాడి మేయర్‌ ఠాకూర్‌ ప్రసాద్‌ ధకాల్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన నేపాల్ ప్రధాని.. రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రణాళికలను తెలియజేశారు. అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని సూచించారు. అదే ప్రాంతంలో రాముడి విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని ఆయన సూచించారు.గతనెలలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో వ్యతిరేకత నెలకొంది. మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత నేతలు ఖండిస్తున్నారు. అయోధ్య మిపూజలో పాల్గొన్న నేపాల్‌ మత బోధకుడు ఆచార్య దుర్గా ప్రసాద్‌ గౌతమ్‌ ప్రధాని ఓలి వ్యాఖ్యలను ఖండించారు.

Related Posts