లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భర్తను బంధించి, నేపాలీ మహిళపై గ్యాంగ్ రేప్

Published

on

Nepalese woman gang-raped : భారతదేశంలో దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి.. కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. భర్తను ఓ గదిలో కట్టేసి..మహిళపై నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.  హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాలో ఓ గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి నేపాలీకి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం రాత్రి తన భర్త వరండాలో పడుకోగా..tubewell room లో తన బిడ్డతో పడుకున్నట్లు ఆమె తెలిపింది.

అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో..కారులో ముఖాలకు ముసుగులు ధరించి ఐదుగురు వ్యక్తులు వచ్చారని, తన భర్తను బంధించి..తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ వెల్లడించింది. ఐదో వ్యక్తి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా..తాను నెట్టివేయడం జరిగిందని, అతను తనను బెదిరించారని పేర్కొంది. అనంతరం భార్యభర్తలిద్దరూ…పెద్దలకు విషయం తెలియచేసి..స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు (IPC sections 376D (gang-rape), 342 (wrongful confinement), 506 (criminal intimidation) and 452 (house-trespass) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.