లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

హత్యలు చేయరు, రక్తం చూడరు.. కానీ, ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్, చెడ్డీ గ్యాంగ్‌ కంటే ప్రమాదకరం

Published

on

nepali gang

nepali gang: ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్. చెడ్డీ గ్యాంగ్‌ కంటే ప్రమాదకరం. నమ్మకంగా నటిస్తూ తడి గుడ్డతో మెడకోసే రకం. అలాగని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేయరు..జస్ట్ మత్తు మందు ఇచ్చి మాయ చేస్తారు. పోలీసులు ఓ వైపు భరతం పడుతున్నా..డోంట్‌ కేర్‌ అంటూ నగరంలో వరుస చోరీలతో దడ పుట్టిస్తున్నారు. ఓ వైపు నగరవాసులకు..మరోవైపు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
భాగ్యనగరంలో మళ్లీ నేపాలీ గ్యాంగ్ పంజా.. మొన్న కోకాపేట, సైనిక్‌పురి..నిన్న రాయదుర్గం.. తాజాగా నాచారంలో నేపాలీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ప్లేస్‌లు మాత్రమే వేరు..జరిగిన సీన్‌ ఒక్కటే..నమ్మకంగా ఉన్నారు..నట్టేట ముంచేశారు.. ఇటీవలే ఖాకీలకు చిక్కిన రాయదుర్గం చోరీ గ్యాంగ్‌.. మేమున్నామంటూ..ఇంతలోనే మరో భారీ దోపిడీ.. వరుస చోరీలతో దడ పుట్టిస్తున్న మత్తు మాయగాళ్లు..

10రోజుల క్రితమే పనిలో చేరిన దంపతులు.. 10లక్షల నగదు, 20 తులాల గోల్డ్ తో జంప్:
హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకున్న నేపాలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా చోరీలకు ఎగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓవైపు గత చోరీల దొంగల ముఠా కోసం ఖాకీలు గాలిస్తుండగానే మరో దోపిడీకి పాల్పడింది ఈ ముఠా. నాచారం ఏరియాలోని ఓ ఇంట్లో కొద్దిరోజుల కిందట ఓ నేపాలీ జంట పనికి కుదిరింది. ఆ ఇంట్లో వాళ్లు శుభకార్యానికి వెళ్లగా వృద్దురాలు మాత్రమే ఉంది. అదే అదునుగా భావించిన ఆ నేపాలీ జంట…ముందుగా వృద్దురాలికి మత్తుమందు ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఇంట్లోని 10లక్షల నగదు, 20 తులాల బంగారంతో ఊడాయించారు.

నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్ చల్, మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షలు, 20 తులాల బంగారం చోరి


ఒక్కో నగరంలో ఒక్కో ఇంట్లో పని.. సోషల్ మీడియాలోనే సంప్రదింపులు:
మొన్న కోకాపేట, సైనిక్‌పురి..నిన్న రాయదుర్గం..లేటెస్ట్‌గా నాచారంలో ఇళ్లు గుల్ల చేసింది ఈ నేపాలీ బ్యాచ్‌. ఖరీదైన వస్తువులతో కూల్‌గా ఉడాయించింది. నేపాల్‌కు చెందిన ముఠా సభ్యుల్లో…నలుగురైదుగురు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడతారు. ముఠా సభ్యులు ఒక్కో నగరంలో ఒక్కో ఇంట్లో పనికి చేరతారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వీళ్లు ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకోరు. అంతా ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, వైబర్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే మాట్లాడుకుంటారు.

ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయి.. నగదు, నగలు ఎంత మొత్తంలో ఉన్నాయి:
వంట దగ్గరి నుంచి ఇంటి పని వరకు ఏదైనా చేస్తారు. యజమానికి నమ్మకంగా ఉంటారు. అదే సమయంలో ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో గమనిస్తారు. నగదు, నగలు ఎంత మొత్తంలో ఉన్నాయో కూడా పసిగడతారు. అ సమాచారం మొత్తాన్ని తమ సభ్యులకి చేరవేస్తారు. ఆ తర్వాత తమదైన స్టయిల్‌లో కథ నడిపిస్తారు. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా పని మానేస్తామని చెబుతారు. కారణాలు అడిగితే ఊళ్లో అర్జంట్ పని ఉందని.. మళ్లీ రాలేనని అంటారు. మీకు అభ్యంతరం లేకుంటే తమ చుట్టాలబ్బాయిని పనిలో పెడతామని చెబుతారు. ఓనర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే అసలు దొంగ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.

అదను చూసి భోజనంలో నిద్ర మాత్రలు.. బంగారం, నగదు, విలువైన వస్తువులతో ఉడాయింపు:
ఇంట్లో అంతకు ముందు పని చేసిన ముఠా సభ్యుడు అసలు దొంగకు పూర్తి సమాచారమిస్తాడు. దాని ఆధారంగా ఆ దొంగ సందర్భం చూసి భోజనంలో నిద్ర మాత్రలు కలుపుతాడు. కాళ్ళు చేతులు కట్టేసి బంగారం, నగదు, విలువైన వస్తువులు తీసుకుని ఉడాయిస్తారు. ఇదీ నెపాలీ ముఠా చోరీ స్టయిల్‌. 2020 జనవరిలో కోకాపేట్‌లో ఇదే తరహా చోరీకి పాల్పడ్డారు. సైనిక్​పురి, రాయదుర్గంతో పాటు ఇప్పుడు నాచారంలోనూ అదే సీన్ రిపీట్ అయింది.

దొంగిలించిన సొత్తు చాలా తక్కువ ధరకే విక్రయం, ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం:
ఒక్కసారి ఒక నగరంలో దొంగతనం చేశారంటే..మళ్లీ అటువైపు వెళ్లరు. ఎత్తుకెళ్లిన సొత్తునంతా ముఠా సభ్యులు వాటాలేసుకుని సమానంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా పగులగొడతారు. ఒక్కరు దొరికినా మిగిలిన వారు పట్టబడకుండా ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు చేరుకుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. వచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ఓవరాల్‌గా ఈ నేపాలీ గ్యాంగ్‌ హిస్టరీ.

ఇతర రాష్ట్రాల వాళ్లను పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్త:
అప్పుడప్పుడు ముఠా సభ్యులు పట్టుబడుతున్నా..దొంగతనాలు నాన్‌స్టాప్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దొంగలు నగరంలో ఇంకా చాలామంది ఉన్నారనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చూశారుగా నమ్మకంగా ఉంటూ.. చివరకు ఎలా నట్టేట ముంచుతున్నారో..సో…ఇతర రాష్ట్రాల వాళ్లను పనిలో పెట్టుకునే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలోకి తీసుకోండి. లేదంటే తెలిసిన వాళ్లను పనిలో పెట్టుకోండి. అలాగే మీ మీ ఇళ్లలోని పని వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండండి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *