నమ్మకంగా ఉంటారు, అదను చూసి దోచేస్తారు.. పని మనుషులతో జాగ్రత్త.. హైదరాబాద్‌‌ను టార్గెట్ చేసిన నేపాలీ గ్యాంగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

nepali gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా..వరసబెట్టి జరుగుతోన్న చోరీలు..రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి..ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది..సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి కారణం ఏంటి..

పిల్లలు కాదు పిశాచాలు.. గుండెలు తీసిన బంటులు.. అంతా మైనర్లే.. సోషల్ మీడియాలో జనం వీక్‌నెస్‌పైనే ఫోకస్ పెట్టారు.. ఏకంగా పోలీసు బాసుల పేర్లతోనే నకిలీ ఫేస్ బుక్ అక్కౌంట్లు ఓపెన్.. అత్యవసరంగా డబ్బు కావాలంటూ దందా చేశారు.. వీళ్లకి బలైపోయిన వాళ్లలో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారు..ఈ ముఠాని సైబరాబాద్ పోలీసులు వారం రోజులు సీక్రెట్ ఆపరేషన్ చేసి మరీ అరెస్ట్ చేశారు..అది కూడా రాజస్థాన్‌లో భరత్‌పూర్‌లో..

రెండు మూడు బస్తాలకు సరిపడ సిమ్‌కార్డులు, చదివింది ఏడెనిమిది తరగతులలోపే..
అరెస్ట్ అయితే చేసారు కానీ..భరత్‌పూర్‌లో వీళ్ల గదులు సోదాలు చేసిన పోలీసులకు నిజమైన షాక్ తగిలింది..ఏకంగా రెండు మూడు బస్తాలకు సరిపడా సిమ్‌కార్డులు దొరకడంతో..అసలు ఇన్ని సిమ్ కార్డ్స్ ఎలా ఇష్యూ చేసారని నివ్వెరపోవడం పోలీసుల వంతైంది..నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ పేరుతో క్రియేట్ అయిన ఈ ఫేస్‌ బుక్ ఫేక్ అక్కౌంట్ల వ్యవహారం ఏకంగా ఏడు రాష్ట్రాల్లో విస్తరించడం ఈ గ్యాంగ్ నెట్‌వర్క్‌కి నిదర్శనం… ఏపీ, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడ్డిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని మోసాలకి పాల్పడిందీ ముఠా..ఇంత చేసీ ఈ ముఠా చదువుకుంది అంతా ఏడెనిమిది తరగతులలోపే..

డొనేషన్లు, ఆర్థిక సాయం చేసే ముందు జాగ్రత్త:
తెలుగు రాష్ట్రాల్లో 236మంది పోలీసుల పేర్లతో ఈ అక్కౌంట్లు క్రియేట్ చేయడంతో.. ఈ ఫేక్‌గాళ్ల లక్ష్యం హైదరాబాద్ అని అర్ధమవుతోంది.. ఈ ఎపిసోడ్‌ని చూసినప్పుడు మనకి క్లియర్‌గా అర్ధమయ్యేది ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం మాత్రమే కాదు..డొనేషన్లు కానీ..ఇతరత్రా ఆర్థికంగా సాయం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేస్కోవాలి.

ఇక గత వారంలో సంచలనం సృష్టించిన రాయదుర్గం చోరీ కేసులో కూడా ఔట్‌సైడర్ క్రిమినల్స్ పాత్ర కలకలం రేపుతోంది. నమ్మకంగా పనులు చేసుకోవడానికి రావడం, కొంత నమ్మకం కుదరగానే..వెంటనే ఇల్లంతా దోచేశారు.. అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటన నగరపౌరులు అప్రమత్తంగా మెలగాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ముందుగా తామంతా ఏదో ఉపాధి కోల్పోయి వచ్చినట్లు కలరింగ్ ఇవ్వడం ఆ తర్వాత చోరీలు చేసి జంప్ అవడం ఇలాంటి ముఠాల నైజం.

రాయదుర్గం విఎన్ఆర్ హిల్స్‌లోని మధసూదన్ రెడ్డి ఇంట్లో ముందుగా ఇలానే ఈ ముఠా చేరింది..ముందు రవి అలియాస్ రాజేందర్ అనే నేరగాడు ఎంట్రీ ఇవ్వగా..ఆ తర్వాత మరో ముగ్గురిని పనికి కుదిర్చాడు..ఇంట్లో నమ్మకంగా ఉంటూ..తమకి అనువైన సమయం రాగానే..కుటుంబం మొత్తానికి ఆహారంలో మత్తు మందు ఇచ్చింది..తర్వాత యజమానురాలు శైలజారెడ్డికి గ్రీన్‌టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఇలా కుటుంబం మొత్తం మత్తులో జారుకున్న తర్వాత వారిని బంధించి తమ పని తాము కానిచ్చేశారు.

READ  ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు : చేసేందుకు టెక్నీషియన్ లేరు

ఈ మత్తులోనే ఫ్యామిలీ మెంబర్లంతా దాదాపు 12 గంటలపాటు ఉన్నారంటే క్రిమినల్ గ్యాంగ్స్ ఏ స్థాయిలో ఆరితేరిపోయారో అర్ధం చేసుకోవచ్చు. రెండోరోజు ఉదయం మధసూదన్ రెడ్డి కుటుంబంలోని చిన్నారికి ముందుగా మెలకువ రావడంతో ఒకరి తర్వాత ఒకరు తమ కట్ల నుంచి బైటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఈ నమ్మించి మోసం చేసిన నేపాల్ గ్యాంగ్‍ని ఉత్తరప్రదేశ్ బోర్డర్ లో పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 20లక్షల రూపాయల సొత్తు రికవరీ చేశారు. నేపాల్ కు చెందిన బహదూర్ షాహీ అలియాస్ నేత్ర దోపిడీకి సూత్రధారి కచ్చితంగా వారంలోపే పోలీసులు ఈ గ్యాంగ్‌‌లో కొందరిని అరెస్ట్ చేయగా.. ఈ సందర్భంగా పోలీసులు చేసిన హెచ్చరికలు గుర్తుంచుకోవాలి.

* ఎవరిని పడితే వాళ్లని పని వాళ్లుగా చేర్చుకోకూడదు..
* అలానే గతంలో ఎక్కడ పని చేశారనే విషయం ఆరా తీయాలి..
* అలానే ఈ హౌస్‌మెయిడ్లను రిక్రూట్ చేయడానికి ఏజెంట్లు కూడా ఉన్నారని.. వారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని గుర్తుంచుకోవాలి.

శివారు ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లు బీకేర్ ఫుల్:
ఈ ఏడాదిలో(2020) ఇలాంటివి మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరిలో కోకాపేటలో కోటి రూపాయలు, ఆగస్టులో సైనిక్‌పురిలో, మరో ఘటనలో ఓ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని నేపాలీ గ్యాంగ్‌ కాజేసింది. నగరం భారీగా విస్తరించడం..శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు ఎక్కువ కావడంతో.. ఈ ప్రాంతాలపై నేరగాళ్లు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.. ఎందుకంటే..ఇక్కడ నేరం జరిగిన సంగతి పోలీసులకు తెలిసేలోగానే క్రిమినల్స్ సరిహద్దులు దాటి వెళ్లిపోవడానికి ఛాన్స్ ఉంటుంది.. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

Related Posts