అవినీతి కేసుల్లో కోర్టుకి ఇజ్రాయెల్ ప్రధాని...ఆ దేశ చరిత్రలో తొలిసారి

Netanyahu corruption trial to open on Sunday

అవినీతి ఆరోపణల కేసులో ఆదివారం(మే-23,2020) ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు జెరూసలేం జిల్లా కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ పేరుపొంది ఓటమి అనేది ఎరుగకుండా సుదీర్ఘ కాలం ఇజ్రాయెల్‌ ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా గత ఏడాది రికార్డు పుటల్లోకి ఎక్కిన నెతన్యాహు.. ఇప్పుడు అందుకు భిన్నమైన రికార్డును మూటగట్టుకోబోతున్నారు.

ఇజ్రాయెల్‌  ప్రధాని హోదాలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న మొట్టమొదటి  వ్యక్తిగా నెతన్యాహు నిలిచారు. 2009నుంచి నెతన్యూహూ ఇజ్రాయెల్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. లంచాలు తీసుకున్న ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలకు ప్రభుత్వ ఫలాలు అందజేస్తూ అందుకు ప్రతిగా నెతన్యాహు తనకు, తన కుటుంబానికి మీడియా కవరేజీ ఇప్పించుకుంటున్నారన్న ఆరోపణతో కేసు నమోదైంది. 

ఒక టెలికం కంపనీ ఓనర్‌కు ప్రభుత్వం నుంచి వందల కోట్ల లబ్ధి చేకూరేలా నెతన్యాహు నిర్ణయాలు చేసినట్లు కూడా ప్రధాన ఆరోపణ ఉన్నది. సంపన్నులైన స్నేహితుల నుంచి కాటన్‌ ల కొద్ది సారాయిని, సిగార్లను లంచంగా తీసుకుని అందుకు బదులుగా వారికి ప్రతిఫలాలు అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని నెతన్యాహు కొట్టిపారేస్తున్నారు. తప్పుడు కేసులతో తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. నెతన్యాహుకి వ్యతిరేకంగా నమోదైన మూడు కేసుల్లో తగిన ఆధారాలున్నాయన 2018ఫ్రిబ్రవరిలో ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తలు