కీర్తి క్రేజ్ మామూలుగా లేదుగా!.. సినిమాకు రూ.10 కోట్లు?..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Keerthy Suresh’s Miss India Streaming Rights: కీర్తి సురేష్ సినిమాకు రూ.10 కోట్లా?.. అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. వివరాళ్లోకి వెళ్తే.. మహానటితో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ లీడ్ రోల్‌లో న‌టించిన మిస్ ఇండియా కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ చిత్ర నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మ‌హేశ్ కోనేరుతో నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్ కుదుర్చుకుందని టాక్ వినిపిస్తోంది. రూ.10 కోట్టు వెచ్చించి Netflix మిస్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు.. దీంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. కొత్త సినిమాల కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మిస్ ఇండియా కోసం భారీ మొత్తంలో ఆఫర్ చేశారని నెట్‌ఫ్లిక్స్ ఈ విష‌యాన్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ చిత్రం ద్వారా న‌రేంద్ర నాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా..లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

Miss India

Related Posts