అంధురాలిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నయనతార.. ‘నెట్రికన్’ టీజర్ చూశారా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Netrikann Teaser: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ్ మూవీ Netrikann (నెట్రికన్‌). ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు నిర్మాత. తన ఫస్ట్ సినిమా ‘నానుమ్ రౌడీదాన్’ పేరు కలిసొచ్చేలా రౌడీ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ రూపొందించి విఘ్నేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ నటించిన ‘గృహం’ చిత్రంతో ప్రశంసలందుకున్న మిలింద్‌ రౌ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇంతకుముందు ‘వసంతకాలం’ మూవీలో బధిర (వినికిడి మరియు మాట్లాడలేని) పాత్రలో ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలిగా కనిపించనుంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి హింసించే ఓ సైకో కన్ను కథానాయికపై పడితే.. అతని నుండి తప్పించుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేది ఆసక్తికరంగా చూపించారు.


బ్లైండ్ క్యారెక్టర్లో నయనతార నటన వేరే లెవల్లో ఉంది. తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్‌తో కూడిన క్యూరియాసిటీ కలిగించిందీ టీజర్. ఆర్.డి.రాజశేఖర్ విజువల్స్, గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Tags :

Related Posts :