లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కొత్త రకం కరోనాపై సమర్థవంతగా పనిచేస్తోన్న “కోవాగ్జిన్”

Published

on

COVAXIN బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ పై త‌మ వ్యాక్సిన్ “కొవాగ్జిన్” స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ట్లు భార‌త్ బ‌యోటెక్‌ తెలిపింది. ఈ మేర‌కు బుధ‌వారం ఆ సంస్థ ఓ ట్వీట్ చేసింది. కొవాగ్జిన్‌ యూకే వేరియంట్‌ను స‌మ‌ర్థంగా అడ్డుకుంటోంది. మ్యూటెంట్ చెందిన వైర‌స్ తప్పించుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని ఆ ట్వీట్‌లో భార‌త్ బ‌యోటెక్ స్ప‌ష్టం చేసింది. ఈ ట్వీట్‌లోనే దీనికి సంబంధించిన రీసెర్చ్ ఫ‌లితాల లింకును కూడా చేర్చింది.

మిగ‌తా వేరియంట్ల కంటే ఈ యూకే వేరియంట్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు ఈ వైర‌స్ వ‌ల్ల మ‌రణాల సంఖ్య కూడా పెరుగుతోంద‌ని ఇటీవల యూకే వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో యూకే వేరియంట్ కేసులు 150 న‌మోద‌య్యాయి.

మరోవైపు,దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 20లక్షలమందికి పైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించి రికార్డు సృష్టించింది భారత్. ఇక, రోజువారి కొత్త కరోనా కేసులు అదేవిధంగా మరణాల సంఖ్య 8నెలల కనిస్ఠానికి పడిపోయింది. దేశంలో గడిచిన 24గంటల్లో… 12,689 కరోనా కేసులు,137మరణాలు నమోదయ్యాయి. ఇక,దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 10,690,279 కాగా మరణాల సంఖ్య 153,751గా ఉంది.