లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఎయిర్ ఫోర్స్‌లో ఎటువంటి లింగ వివక్ష అనుభవించలేదు: గుంజన్ సక్సేనా

Published

on

Indian Air Force లో తాను ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదని మాజీ లెఫ్టెనింట్ గుంజన్ సక్సేనా చెప్పుకొచ్చారు. గురువారం ఢిల్లీ హై కోర్టులో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఎయిర్ ఫోర్స్‌లో చేరడాన్ని దేశానికి సేవ చేసే అవకాశంగా భావించానని ఆమె అన్నారు. కార్గిల్ యుద్ధంతో సహా.. ఎయిర్‌ఫోర్స్‌లో చేసిన సేవల గొప్పగా అనిపిస్తాయని ఆమె అ్నారు.

Gunjan Saxena – The Kargil Girl అనే సినిమాను థియేటర్లలో, నెట్‌ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్స్‌లలో నో అబ్జక్షన్ సర్టికేట్ లేకుండానే రిలీజ్ చేసేశారని.. దీనిపై పర్మినెంట్ యాక్షన్ తీసుకోవాలంటూ కోరారు. కేంద్రం.. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమవుతోన్న గుంజన్ సక్సేనా మూవీలో లింగ వివక్ష చూపెడుతున్నట్లుగా ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పింది.జస్టిస్ రాజీవ్ శాక్దేర్ ముందు సక్సేనా అఫిడవిట్ సబ్‌మిట్ చేశారు. మూవీ కేవలం తన జీవితం నుంచి ఇన్‌స్పైర్ అయి తీసిందేనని సినిమా మొదటి నుంచి రెండు రకాల వివక్షలు కనిపించాయని.. యువతులను IAFలో జాయిన్ అయ్యేందుకు ప్రోత్సహించేలా ఉన్నాయి.

‘సినిమాలో చూపించినవన్నీ తన జీవితంలో జరిగినవి కాదని సక్సేనా క్లెయిమ్ చేశారు. కానీ, యువతులు ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు ప్రోత్సహించేలా ఉందని నమ్ముతున్నట్లు చెప్పారు. మహిళలు వారి కలలను సాకారం చేసుకునేలా సినిమా ఉందని.. లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేయడానికైనా తాము వెనుకాడమని’ ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నట్లు ఆదిత్య దేవన్ తెలిపారు.

సినిమా మేకింగ్ లో సీన్లు క్రియేట్ చేయడంలో తన కంట్రోలింగ్ ఏం లేదని ఆమె చెప్పారు. ఇన్‌స్టిట్యూషన్ స్థాయి నుంచి తాను ఎటువంటి వివక్షణు ఎదుర్కోలేదని అన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాతిని కాపాడటంలో, కార్గిల్ యుద్ధం అంశంలో దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చిందని ఆమె వివరించారు.

రిటైర్డ్ ఆఫీసర్ అయిన ఆమె ఐఏఎఫ్ గురించి ఇచ్చే గౌరవం వేరు.. ప్రతి ఒక్కరూ సినిమా గురించి ప్రశ్నించే కోణం వేరు అని కేంద్రం అభిప్రాయపడుతుంది. హైకోర్టు కొద్ది రోజుల క్రితమే ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైరక్టర్లు కరణ్ యాజ్ జోహర్, హీరో యాష్ జోహర్, సీఈఓ అపూర్వ మెహతా, జీ ఎంటర్‌టైన్మెంట్, డైరక్టర్ శరణ్ శర్మ, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్పీ, ఎమ్/ఎస్ నెట్‌ఫ్లిక్స్, గుంజన్ సక్సేనాల నుంచి రెస్పాన్స్ రావాలని.. కొందరికి నోటీసులు ఇచ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *