లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

AA 20- లారీ డ్రైవర్ లుక్ ఇదే..

AA 20- సరికొత్త గెటప్‌లో కనిపించనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

Published

on

is this new Allu Arjun look for Sukumar Movie

AA 20- సరికొత్త గెటప్‌లో కనిపించనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

‘అల వైకుంఠపురములో..’ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయనున్నాడు. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతకొద్ది రోజులుగా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు బన్నీ.

స్టైలిష్ స్టార్ రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన పర్సనల్ బాడీగార్డు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైనప్పుడు కొత్త గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్‌మెన్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. లారీ డ్రైవర్ అంటే మాస్ లుక్ కావాలి కాబట్టి ఈ గెటప్ ఆ క్యారెక్టర్ కోసమేనని తెలుస్తోంది.

Read Also : పూరి, చార్మీ కలిసి తాళం వేశారు..

కరోనా ఎఫెక్ట్ కారణంగా కేరళలో జరగాల్సిన షెడ్యూల్ వాయిదా వేశారు. త్వరలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

is this new Allu Arjun look for Sukumar Movie
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *