Political
కొత్త అసెంబ్లీలో విశేషాలు
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
Home » కొత్త అసెంబ్లీలో విశేషాలు
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
Published
2 years agoon
By
chvmurthyతెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
హైదరాబాద్: జనవరి 17 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగురోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అవుతాయి. అనంతరం స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ముగియనున్నాయి.
తెలంగాణా ఆవిర్భావం తర్వాత రెండోసారి తెలంగాణా శాసనసభ కొలువు దీరనుంది. డిసెంబర్ 11వ తేదీనే ఎన్నికల ఫలితాలు వెలువడ్డా, వివిధ కారణాలతో శాసనసభ ఏర్పాటు కాలేదు. కొత్తగా కొలువు దీరుతున్న శాసనసభ కు సంబంధించిన కొన్ని విశేషాలను పరిశీలిద్దాం…..
సభలో మొత్తం సభ్యుల సంఖ్య………119 + 1 అంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే= 120
పార్టీల వారిగా సభ్యులు
తెలంగాణా రాష్ట్ర సమితి…88
కాంగ్రెస్………………….19
ఎంఐఎం…………………7
టిడిపి……………………2
బిజెపి……………………1
స్వతంత్ర………………..2 (టీఆర్ ఎస్ లో చేరిక)
శాసనసభలో సీనియర్ నేత …కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఉప సభాపతితో పాటు మరిన్నికీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉంది.1985 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుపు సాధించారు.
డబుల్ హ్యట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు……..ముంతాజ్ ఖాన్, ఎంఐఎం
ఎర్రబెల్లి దయాకర్ రావ్, టిఆర్ ఎస్
రెడ్యా నాయక్, టిఆర్ ఎస్
తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్న ఎమ్మెల్యేలు…..23 మంది
గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు ………………76 మంది
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన మల్లారెడ్డి , బాల్క సుమన్ లు ఈసారి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి..తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. ఎమ్మెల్సీలుగా కొనసాగిన మైనంపల్లి హన్మంత్ రావ్, నరెందర్ రెడ్డిలు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ బుధవారం సాయంత్రం గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం సభలో సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శాసనసభలో శాసనసభ్యుడిగా కేసిఆర్ తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలౌతుంది.
కొత్తగా కొలువుదీరనున్న అసెంబ్లీ కావడంతో….అసెంబ్లీని కూడా ముస్తాబు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.