షార్ట్ ఫిల్మ్ స్టార్ కావాలనుకుంది…మేనమామతో పెళ్లి చేశారని..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తూర్పుగోదావరి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. చదువుకు అడ్డు చెప్పి బలవంతంగా మేనమామతో పెళ్లి చేయడంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితం రమ్యశ్రీకి తన మేనమామతో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. ఇష్టం లేదని చెప్పినా.. తల్లిదండ్రులు వినకపోవడంతో చివరికి రమ్యశ్రీ బలవన్మరణానికి పాల్పడింది.మండపేట మండలం ఏడిదసీతానగరంకు చెందిన నవ వధువు రమ్యశ్రీ నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రమ్యశ్రీకి మూడు రోజల క్రితం మేనమామతో పెళ్లి జరిపించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రమ్యశ్రీ ఉన్నత చదువులు చదువుతానని చెప్పింది. అయితే తనకు మరో చెల్లి ఉన్నందున ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేయడం కష్టమని భావించిన తల్లిదండ్రులు తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి పెద్దగా, బాధ్యతగా భావించి బలవంతంగా మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు.

మొదటగా ఆమె నిరాకరించినప్పటికీ తర్వాత పెద్దలంతా సర్ది చెప్పి, వారి సమస్యను చెప్పడంతో పెళ్లికి ఆమె అంగీకరించారు. మూడు రోజుల క్రితం ఆమెకు మేనమామతో పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నత చదువులు చదవలేననే మనస్థాపం చెందింది. దాంతోపాటు మొదటి నుంచి ఆమెకు షార్ట్ ఫిల్మ్స్ పై ఇంట్రెస్టు… ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా ఆమె నటించారు.ఈ నేపథ్యంలో పెళ్లైన తర్వాత మళ్లీ చదవడానికి గానీ, షార్ట్ ఫిల్మ్ తీయడానికి గానీ అవకావం ఉండదేమోనని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు మండపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Related Posts