రుతస్రావ వివక్షపై కొత్త రంగు..‘పీరియడ్ రెడ్’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

new color period red pantone and intimina companies : రుతస్రావం. (బహుష్టు,ముట్టు) ప్రతీ నెలా మహిళలకు వచ్చే పీరియడ్ సర్వసాధారణం. కానీ రుతుస్రావంపై ఈ కంప్యూటర్ యుగంలో కూడా ‘ఆ మూడు రోజులు’ అశుభం..అంటకూడదు..ముట్టకూడదు..దూరంగా ఉండాలి..ఇంట్లోకి రాకూడదు..శుభకార్యాలకు వెళ్లకూడదు అనే నమ్మకాలు పోవటంలేదు. రుతుస్రావం అంటే భయపడిపోవటం కూడా పోలేదు. అసలు దీని గురించి మాట్లాడటం కూడా తప్పు..సిగ్గు అనుకుంటున్నారు.


ఇక రుతుస్రావం రక్తం కనిపిస్తే భయపడిపోయేవారికి లెక్కలేదు. పొరపాటున అది బైటకు కనిపిస్తే అదేదో అవమానంగా..భయంగా..అత్యంత సిగ్గు పడే విషయంగా మహిళలు..యువతులు భావిస్తుంటారు. ఆ సమయంలో మహిళలు పడే యాతన వర్ణనాతీతం. స్త్రీ శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే ఆ రక్తంపై వివక్షను నిర్మూలించడానికి వర్ణ శాస్త్రవేత్తలు ‘‘కొత్త రంగు’’ తయారు చేశారు.


అమెరికాకు చెందిన Pantone స్వీడన్‌కు చెందిన Intimina అనే కంపెనీలు ఈ వర్ణాన్ని (రంగు) తయారు చేశాయి. దీనికి ‘పీరియడ్ రెడ్’ అని పేరు పెట్టారు. రుతస్రావంపై నెలకొన్న వివక్షకు,..అవగాహనలేమికి ఈ ‘రంగు చెక్’ పెడుతుందని, దీన్ని సమాజంలోకి ప్రచారంలోకి తీసుకురావడం వల్ల రుతుస్రావ రక్తం కూడా మన రక్తంలో ఒక భాగమనే సంకేతం వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తూన్నారు. అదే విషయాన్ని తెలిపారు.


‘ఇది ఒరిజినల్ కలర్. ప్రవాహానికి సంకేతం’ అని పేర్కొన్నారు. రుతుస్రావంపై వివక్ష వల్ల పేద దేశాల్లో అమ్మాయిలు చదువును మానేయాల్సి వస్తోందని..ముఖ్యంగా ఇది గ్రామాల్లో ఎక్కువగా ఉంటోందని..కేవలం పీరియడ్స్ వల్ల చదువులు మానేయటం చాలా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. రుతుస్రావం విషయంలో ఇదే నమ్మకం కొనసాగితే ఆడపిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.


ప్రకృతి ధర్మం అయని పీరియడ్ (ముట్టు)పై అవగాహన లేకపోవడమే దీనికి కారణమని, దీనిపై స్కల్స్ లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. కేవలం పీరియడ్స్ రోజుల్లో ఆడపిల్లు స్కూల్స్ కు రావటంలేదనీ..ముఖ్యంగా గ్రామాల్లోను..చిన్న చిన్న పట్టణాల్లోకూడా స్కూళ్లలో ఆడపిల్ల డ్రాప్ అవుట్స్ కు ఈ పీరియడ్స్ కారణంగా ఉందనే విషయం పలు సర్వేల్లో వెల్లడైందని తెలిపారు.


రుతస్రావంపై నెలకొన్న వివక్షకు,..అవగాహనలేమికి ఈ ‘రంగు చెక్’ పెడుతుందని, దీన్ని సమాజంలోకి ప్రచారంలోకి తీసుకురావడం వల్ల రుతుస్రావ రక్తం కూడా మన రక్తంలో ఒక భాగమనే సంకేతం వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తూన్నారు. ఇది నూటికి నూరు శాతం అవగామన కలిగిస్తే తమ ఆలోచనలు ఫలించినట్లేనని తెలిపారు.

Related Posts