లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

జూన్ లోనే కాంగ్రెస్ కి కొత్త బాస్

Published

on

New Congress President పార్టీ కొత్త చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) ఓ నిర్ణయానికి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2021 జూన్‌లో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మీటింగ్ అనంతరం పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

అయితే,ఇవాళ సీడబ్యూ సమావేశంలో పార్టీలోని రెండు గ్రూప్ ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తక్షణమే వ్యవస్థాపక ఎన్నికలు నిర్వహించాలని… గడిచిన కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిపై పార్టీ నాయకత్వం,నిర్వహణపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్,ఆనంద్ శర్మ,ముకుల్ వాస్నిక్,పి.చిదంబరం ఇవాళ సీడబ్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు.

అయితే,మరో గ్రూప్ లోని అశోక్ గెహ్లాట్,అమరీందర్ సింగ్,ఏకే ఆంటోనీ,తారిఖ్ అన్వర్,ఒమన్ చాందీ..వెస్ట్ బెంగాల్,తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాతనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగాలని తెలిపారు. చివరికి రెండో గ్రూప్ తన మాటను నెగ్గించుకుంది. త్వరలోనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు సీడబ్యూసీ ఎన్నికలకు సంబంధించిన తేదీలు ప్రకటించబడతాయని,అంతిమ నిర్ణయం సోనియా గాంధీదేనని నేతలు తెలిపారు. CWCకి చివరగా1997లో ఎన్నిక జరిగింది.

ఇవాళ సీడబ్యూసీ మీటింగ్ సమయంలో ఓ నాయకుడు… ఎవరి అజెండా వైపు మనం పనిచేస్తున్నాము? మన పార్టీ మాదిరిగా అంతర్గత ఎన్నికల గురించి బీజేపీ మాట్లాడదు? మెదటి ప్రాధాన్యం రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడటం..అప్పుడు వ్యవస్థాపక ఎన్నికలు అని ఓ నాయకుడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

కాగా, 2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్‌ గాంధీ… ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అయితే, తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది ఏఐసీసీ.