Home » కొత్త సంవత్సరంలో కొత్త సినిమాల సందడి మొదలైంది..
Published
1 month agoon
New Movie Teaser: కొత్త సంవత్సరం కొత్త సినిమాల స్పీడ్ ఊపందుకుంది. లాస్ట్ ఇయర్ అంతా పెద్దగా యాక్టివిటీ లేకుండా కామ్‌గా ఉన్న హీరోలందరూ ఫుల్‌ఫ్లెడ్జ్‌గా పనిలోకి దిగుతున్నారు. అయిపోయిన సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటూనే.. కొత్త సినిమాలను పరిచయం చేస్తున్నారు. ఇలా లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్స్, వీడియోస్ ఏంటో ఓ సారి చూద్దాం..
సినిమా స్టార్ట్ అయ్యింది అని నిన్న ఇలా అనౌన్స్ చేశారో లేదో.. ఇవాళ షూటింగ్ వీడియోని పోస్ట్ చేసేశారు పవన్ కళ్యాణ్.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఫుల్ స్పీడ్‌లో ఉన్న పవన్ వరుసగా సినిమాలు అనౌన్స్ చెయ్యడమే కాదు.. అంతే స్పీడ్‌గా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్స్‌లో సాగర్ కె చంద్ర డైరెక్షన్లో ‘అయ్యప్పన్ కొషియమ్’ సినిమా ఫస్ట్ షెడ్యుల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్‌తో స్టార్ట్ చేశారు పవన్. దీనికి సంబందించి పవన్, త్రివిక్రమ్ షూటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నాడు మెగా మేనల్లుడు. పోయిన నెలలోనే ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమా రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. లేటెస్ట్గా తన 14వ మూవీకి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేవ కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి యాప్ట్ అయ్యేలా ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు..
స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరో సుశాంత్ కూడా తన బండి దుమ్ముదులిపాడు. దర్శన్ డైరెక్షన్లో లాస్ట్ ఇయర్ రిలీజ్ కావల్సిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాని కూడా స్పీడప్ చేసేశారు సుశాంత్. అప్పుడెప్పుడో టీజర్ రిలీజ్ చేసిన యూనిట్.. మళ్లీ నెక్ట్స్ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడో చెబుతామంటూ చిన్న వీడియో రిలీజ్ చేసింది..
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా ఫస్ట్ టైమ్ టాలీవుడ్ స్క్రీన్ మీద హాకీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’.. స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్లో కరప్షన్ బ్యాక్ డ్రాప్లో జీవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది టీమ్
.