గొంతులో కొత్త అవయవం.. చూసి షాకైన సైంటిస్టులు..! అదేలా ఉందో చూడండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

New organ in throat : మనిషి శరీరంలో ఏయే అవయవాలు ఉంటాయో అందరికి తెలుసు.. కానీ, గొంతులో ఓ కొత్త అవయవం ఉందంట.. అనుకోకుండా సైంటిస్టులకు గొంతులో కొత్త అవయవం కనిపించిందంట.

ప్రొటెస్ట్ కేన్సర్ పరిశోధనలో భాగంగా గొంతు నిర్మాణాన్ని పరిశీలిస్తుండగా అనుకోకుండా ఈ కొత్త అవయవం నెదర్లాండ్ సైంటిస్టుల కంట పడిదంట. కొత్తగా గుర్తించిన ఈ అవయవంతో గొంతు‌పై భాగాల్లో ఉండే లాలాజాల గ్రంథులతో తేమతో కూడిన ద్రవపదార్థాన్ని వినియోగిస్తుంటుందని తెలిపారు.గొంతులోని ప్రొస్టేట్ కేన్సర్‌పై పరీశోధనలు చేస్తున్నప్పుడు అనుకోకుండా కొత్త అవయవం బయటపడిందని రీసెర్చర్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI)తో సహా పరిశోధకుల బృందం Radiotherapy and Oncology జనరల్‌లో ప్రచురించింది.

మానవులలో గొంతులో ద్వైపాక్షిక సూక్ష్మ లాలాజల గ్రంధులు ఉంటాయని గతంలోనే పరిశోధన ద్వారా తేలింది. వీటికి సైంటిస్టులు ట్యుబరియల్ గ్రంధులుగా పేరు పెట్టారు. పరిశోధనలను నిర్ధారించడానికి కనీసం 100 మంది రోగులను పరిశోధకులు పరీక్షించారు. వారందరికీ ఈ గ్రంథులు ఉన్నాయని కనుగొన్నారు.positron emission tomography (PET) స్కాన్లు, సీటీ స్కాన్ల కాంబినేషన్ తో కూడిన PSMA PET-CT ద్వారా సైంటిస్టులు గొంతులోని ప్రొస్టేట్ కేన్సర్ కణాలను స్కానింగ్ చేస్తున్న సమయంలో ఈ కొత్త గ్రంథులను గుర్తించారు. ఈ టెక్నిక్ లో భాగంగా డాక్టర్లు పేషెంట్ లోకి రేడియో యాక్టివ్ ట్రేసర్ ఎక్కిస్తారు.

ప్రొస్టేట్ కేన్సర్ కణాలను PSMA ప్రొటిన్ ద్వారా బయటకు తీస్తారు. ఈ కాంబినేషన్ స్కాన్లతో PSMAలో లాలాజాల గ్రంథి కణజాలలను సులభంగా గుర్తించవచ్చు. కేన్సర్ చికిత్స కోసం డాక్టర్లు వినియోగించే రేడియో థెరపీ ద్వారా తల, మెడను ప్రధాన లాలాజల గ్రంథులకు దూరంగా ఉండేలా ప్రయత్నిస్తారు. లేదంటే ఆ కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా తినడం, మాట్లాడటం లేదా మింగాలంటే పేషెంట్లకు చాలా కష్టంగా మారుతుంది.కానీ, కొత్తగా కనుగొన్న ఈ లాలాజల గ్రంథులపై ఇంకా రేడియేషన్ ప్రభావం పడుతూనే ఉందని రీసెర్చర్లు అంటున్నారు. దీని కారణంగా ఆయా పేషెంట్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో డాక్టర్లకు కూడా పెద్దగా అవగాహన లేదని చెబుతున్నారు.ఈ రేడియో థెరపీ తీసుకునే పేషెంట్లలో ఈ గ్రంథులను విడిచిపెట్టడం ద్వారా వారిలో నాణ్యమైన జీవితాన్ని మెరుగుపర్చే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ గ్రంథులను రేడియేషన్ నుండి ఎలా తప్పించాలో తెలుసు కోవాల్సిన అవసరం ఉందని అధ్యయన పరిశోధకులలో ఒకరైన NCIకి చెందిన Dr Wouter V Vogel చెప్పారు.

పుర్రె భాగంలో గ్రంథులు ఉన్నందున వాటిని గుర్తించడం సాధ్యపడలేదన్నారు. మానవ కంటికి కనిపించినంతగా చాలా చిన్నగా గ్రంథులు ఉన్నాయని చెప్పారు. ఈ గ్రంథులను చాలా సున్నితమైన ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మాత్రమే గుర్తించగలమని Vogel తెలిపారు.

Related Tags :

Related Posts :