కోవిడ్-19 కొంతమంది నడి వయసు వారికి కూడా చాలా ప్రమాదకరం.. : కారణం చెప్పిన శాస్త్రవేత్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID-19 తీవ్రమైన కేసులతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరిన రోగులలో బలహీనమైన టైప్ I ఇంటర్ఫెరాన్ (IFN) సిగ్నలింగ్ ఉన్నట్లుగా రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. మాములుగా అయితే కరోనా రోగులు దాదాపు కోలుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వయస్సు ఎక్కువగా ఉన్నవారికి కరోనా ప్రమాదకరమే. కానీ కొందరు తక్కువ వయసు ఉన్న యువతలో కూడా ఇది ప్రమాదకరం అని చెబుతున్నారు. కొవిడ్‌-19 తీవ్ర రూపం దాల్చడానికి వారిలో ఉన్న జన్యువులే కారణం అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

ప్రపంచంలో మహమ్మారిగా మారిన కరోనా వైరస్ బారినపడుతున్న 10 శాతం మంది యువకులు, ఆరోగ్యవంతుల్లో.. తప్పుదోవ పట్టిస్తున్న యాంటీబాడీలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి వైరస్‌పై కాకుండా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపైనే దాడి చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇన్‌ఫ్లుఎంజా వైరస్ TLR3 మరియు IRF7- ఆధారిత రకం I IFN రోగనిరోధక శక్తిని నియంత్రించడానికి తెలిసిన 13 జన్యు స్థానాలపై దృష్టి కేంద్రీకరించిన పరిశోధకులు, తీవ్రమైన COVID-19 లక్షణాలతో ఉన్న 3.5% మంది రోగులలో యాంటీబాడీస్ అరుదైన పనితీరు జన్యు వైవిధ్యాలను కనుగొన్నారు. అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

కరోనా వైరస్‌ వల్ల చాలా మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొందరు మాత్రం ఆ మహమ్మారి బారినపడిన కొద్దిరోజుల్లోనే చనిపోతూ ఉన్నారు. దీనికి కారణం సదరు యాంటీబాడీలు, జన్యు ఉత్పరివర్తనలేనని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ రెండు రకాల సమస్యలు ఉన్నవారిలో.. కీలకమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్‌ ఐ ఇంటర్‌ఫెరాన్‌’ లోపిస్తున్నట్లుగా వెల్లడించారు.పుట్టుకతో వచ్చిన రోగనిరోధక శక్తిలో ఈ ప్రొటీన్లు భాగం కాగా.. వైరస్‌లు దాడి చేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడానికి ముందే ఇవి రంగప్రవేశం చేస్తాయని స్పష్టం చేశారు. కణ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. తీవ్రస్థాయి కొవిడ్‌-19 బారినపడిన కొందరు బాధితుల్లో స్వీయ యాంటీబాడీలే ఈ ఇంటర్‌ఫెరాన్లను నాశనం చేస్తాయని వారు చెబుతున్నారు.

Related Posts