లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

టెస్ట్, లక్షణాల కన్నా ముందే.. కరోనాను ఆపిల్ వాచ్ పసిగట్టేస్తుంది.. ఎలానంటే?

Published

on

Apple Watch can help detect COVID-19 : కరోనా టెస్ట్, లక్షణాల కంటే ముందుగానే ఆపిల్ వంటి స్మార్ట్ వాచ్‌లు వైరస్ సోకినట్టు ఎలా డిటెక్ట్ చేయగలవో కొత్త అధ్యయనాల్లో తేల్చేశారు రీసెర్చర్లు. సాధారణంగా కరోనా సోకిందని నిర్ధారణ కావాలంటే టెస్టింగ్ చేయాలి. లేదంటే.. వైరస్ లక్షణాలు బయటపడితే తప్పా తెలియడం కష్టం.. అలాంటిది టెస్టు, వైరస్ లక్షణాల కన్నా ముందుగానే కరోనాను నిర్ధారించేందుకు స్మార్ట్ వాచ్ ఎలా పనిచేస్తుందో అధ్యయన ఫలితాల్లో వివరించారు. ఆపిల్ స్మార్ట్ వాచ్ పనితీరుకు సంబంధించి న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి హెల్త్ సిస్టమ్, కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రెండు అధ్యయనాలను నిర్వహించారు టెక్ నిపుణులు.

ఈ అధ్యయనాల్లో ఆపిల్ స్మార్ట్ వాచ్.. కరోనా మహమ్మారి వంటి ఇతర సీజనల్ వ్యాధుల వ్యాప్తిని ఈజీగా డిటెక్ట్ చేయగలదని గుర్తించారు. ఆపిల్ స్మార్టో వాచ్ ధరించిన కరోనా బాధితుడిలో హార్ట్ బీట్ లో మార్పుల ఆధారంగా గుర్తించగలదని అంటున్నారు. కరోనా లక్షణాలు, పాజిటివ్ తేలడానికి వారం రోజుల ముందే ఈ ఆపిల్ వాచ్ కనిపెట్టగలదని చెబుతున్నారు.

ఆపిల్ 29 నుంచి సెప్టెంబర్ 29 మధ్య నెలలో ఆపిల్ వాచ్ ధరించిన 300 మంది హెల్త్ కేర్ వర్కర్లలో వారి హార్ట్ రేట్ లో మార్పులు, సమయాన్ని విశ్లేషించారు. సాధారణంగా ఈ హార్ట్ బీట్ రేటు ఆధారంగానే ఒక వ్యక్తిలో రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుందనే సులభంగా తెలుసుకోవచ్చు. ఆపిల్ స్మార్ట్ వాచ్ లోనూ ఇదే విధానంలో సులభంగా గుర్తించవచ్చునని అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక టూల్స్ ద్వారా ఇన్ఫెక్షన్ సోకినప్పుడే వెంటనే గుర్తించేలా ఆపిల్ వాచ్ వంటి స్మార్ట్ డిటెక్టర్లను డెవలప్ చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.

లక్షణాలు కనిపించడానికి నాలుగు నుంచి 7 రోజుల ముందే దాదాపు మూడింట రెండో వంతు కరోనా కేసులను ఈజీగా గుర్తించవచ్చునని రీసెర్చర్లు పేర్కొన్నారు. అంతేకాదు.. అలారం సిస్టమ్ కూడా క్రియేట్ చేశారు. దీని ద్వారా ఆపిల్ వాచ్ ధరించిన బాధితుల్లో హార్ట్ రేటులో ఏమైనా మార్పులు వస్తే.. వెంటనే అలారం అలర్ట్ అయ్యేలా సెట్ చేశారు. కరోనా లక్షణాలు కనిపించని అసింపిటిథిక్ బాధితుల్లో కూడా వైరస్ సోకిననట్టు ముందుగానే ఆపిల్ స్మార్ట్ వాచ్ సాయంతో గుర్తించవచ్చునని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.