అదేపనిగా పోర్న్ చూస్తే.. రొమాన్స్‌లో మజా తగ్గతుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Porn Affects Relationship Satisfaction : లైంగిక సంబంధాలు బలపడాలంటే జంటల్లో ఒకరినొకరిపై నమ్మకం, ఆకర్షణ, ప్రేమానురాగాలు ఉండాలంటారు.. అప్పుడే వారి లైంగిక బంధం బలపడుతుంది.. చాలావరకు జంటలు పోర్న్ చూసే అలవాటు ఉంటుంది.. రొమాన్స్ పై కూడా అదే స్థాయిలో ఉత్సాహం కనిపిస్తుంటుంది.. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేటి ఆధునిక సమాజంలో పోర్న్ చూసే సంస్కృతి కూడా పెరిగిపోయింది.

ఇలాంటి పోర్న్ కంటెంట్ చూడటం కారణంగా జంటల మధ్య సంబంధాలు, లైంగిక సంతృప్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, వాస్తవానికి అదేపనిగా పోర్న్ చూసేవారిలో వారి లైంగిక సంతృప్తిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఓ కొత్త అధ్యయనం తేల్చేసింది.పోర్న్ చూడటంపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవారిలో లైంగిక పరంగా సంతృప్తి కోల్పోయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటోంది. పోర్న్ కంటెంట్ చూసే జంటల్లో రొమాన్స్ లో మజా తగ్గదని తేల్చింది. అదేపనిగా పోర్న్ చూస్తే.. రొమాన్స్ లో ఏమాత్రం మజా తగ్గదని ఈ కొత్త పరిశోధనలో తేల్చేశారు పరిశోధకులు.

కెనడాలోని Sexual behavior experts క్లినికల్ సైకాలిజిస్టులు 140 మిక్సడ్-సెక్స్, 77 స్వలింగ సంబంధాలతో సహా 217 జంటలపై అధ్యయనం చేశారు.. వారిలో లైంగిక సంబంధాల సంతృప్తితో పాటు పోర్న్ వాడకం ఎలా ఉందో 35 రోజుల డైరీలో నోట్ చేయాలని కోరారు. ఈ అధ్యయనంలో 80 శాతం జంటలు 35 రోజులలో కనీసం ఒక్కసారైనా పోర్న్ వీడియోలను చూశారని తేలింది.పురుషులతో రిలేషన్ ఉన్న పురుషులలో 97 శాతానికి పైగా, 75 శాతం మంది పురుషులు మహిళలతో భాగస్వామ్యం, 56 శాతం మహిళలు మహిళలతో భాగస్వామ్యం, 40 శాతం మంది మహిళలు కొంత స్థాయిలో పోర్న్ చూసినట్టు గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొనేవారు 35 రోజులలో సగటున 3.45 రోజులు పోర్న్ వీడియోలను వీక్షించారని వివరించారు.

సున్నా రోజుల నుండి 31 రోజుల వరకు ఉంటుంది. మహిళలు, తమ భాగస్వామి శృంగారంతో సంబంధం లేకుండా, తమ భాగస్వామితో ఎక్కువగా లైంగిక సంబంధం కలిగి ఉంటే పోర్న్ ఎక్కువగా చూస్తారంట.. పోర్న్ వాడకం అనేది.. సొంత భాగస్వామిలో అధిక లైంగిక కోరికతో ముడిపడి ఉందని గుర్తించారు.ఈ పరిశోధనలో పాల్గొనే వారందరిలో పోర్న్ వాడకం వారి లైంగిక సంబంధంలో సంతృప్తికి ఎలాంటి సంబంధం ఉన్నట్లు కనిపించలేదు. పోర్న్ వాడకంతో సంబంధం లేకుండా, అన్ని రకాలైన సంబంధాలలో సాధారణ సంబంధాల లైంగిక సంతృప్తి ప్రభావితం కాలేదు. పోర్న్ వాడకం అధికంగా ఉన్నవారిలో సంతృప్తితో సంబంధం లేదని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో పాల్గొనేవారిని బృందం స్వచ్ఛందంగా అధ్యయనానికి ఎంచుకుంది.

Related Tags :

Related Posts :