లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కరోనా మ్యుటేషన్లతో వైరస్ వ్యాప్తి పెరగదంట : కొత్త అధ్యయనం

Published

on

corona-virus mutations not increase transmissible : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ రానురాను మ్యుటేషన్ అవుతోంది. ప్రారంభంలో మాదిరిగా వైరస్ లక్షణాలు కనిపించడంలేదు. వైరస్ తీవ్రతలో మార్పు వచ్చిదంట.. కానీ, కరోనా వైరస్ మ్యుటేషన్ల కారణంగా మనుషుల్లో వైరస్ సంక్రమణ పెరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని కొత్త అధ్యయనంలో తేలింది.ఈ అధ్యయనాన్ని నేచర్ జనరల్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 46వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించిన తర్వాత పరిశోధకులు కరోనా వైరస్ సంక్రమణపై లోతుగా అధ్యయనం చేశారు. జూలై 2020 ఆఖరి వరకు 99 దేశాల్లోని కరోనా బారినపడిన 46,723 మంది బాధితుల నుంచి సేకరించిన వైరస్ జన్యువులను పరిశోధకులు విశ్లేషించారు.

కరోనా వైరస్ రోజురోజుకీ కొత్తగా మ్యుటేషన్ కావడంతో రియల్ టైంలో కచ్చితంగా విశ్లేషించాలంటే అతిపెద్ద డేటా అవసరమని గుర్తించామని రీసెర్చర్లు పేర్కొన్నారు. యూకేలోని యూనివర్శటీ లండన్‌లో జరిగిన అధ్యయనంలో.. మ్యుటేషన్లతో వైరస్ సంక్రమణ పెరగడం లేదా లక్షణాల తీవ్రత పెరిగిందా? అనేదానిపై పరిశోధకులు ప్రధానంగా విశ్లేషించారు.అదృష్టవశాత్తూ.. కరోనా వైరస్ వ్యాప్తికి ఈ మ్యుటేషన్లు కారణం కాదని గుర్తించామన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు వైరస్ కొత్త మ్యుటేషన్లపై కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 6.10 కోట్లు దాటాయి. కరోనా మరణాల సంఖ్య 14 లక్షలకు పెరిగింది.

ప్రపంచంలో కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు మొత్తంగా 150 వరకు వ్యాక్సిన్లు రేసులో ఉన్నాయి. మరోవైపు కరోనా కొత్త మ్యుటేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి.రీసెర్చర్ల అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ SARS-CoV-2 మూడు రకాలుగా మ్యుటేషన్ అవుతుందని అంటున్నారు. వైరల్ రెప్లికేషన్ సమయంలో ఒకే కణానికి సోకే ఇతర వైరస్‌లతో పరస్పర చర్య ద్వారా లేదా వాహక రోగనిరోధక వ్యవస్థ ద్వారా ప్రేరణ చెందుతాయి.

దాదాపు మ్యుటేషన్లన్నీ తటస్థంగా ఉంటాయి. ఇతర వైరస్‌లు కరోనా వైరస్‌కు ప్రయోజనకరంగా లేదా హానికరంగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుత అధ్యయనంలో కరోనావైరస్‌లో 12,706 వరకు మ్యుటేషన్లను సైంటిస్టులు గుర్తించారు.వీటిలో 398 మ్యుటేషన్లపై బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో 398 మ్యుటేషన్లలో 185 వరకు కనీసం మూడు సార్లు స్వతంత్రంగా మ్యుటేషన్ జరిగి ఉండొచ్చునని రీసెర్చర్లు గుర్తించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *