Home » కొత్త సంప్రదాయం : ప్రజల మధ్యలో కేజ్రీ ప్రమాణ స్వీకారం
Published
12 months agoon
By
madhuఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు…తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు కేజ్రీ.
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల సీఎంలు..మాజీ సీఎంలని పిలిచి హంగామా చేయడం జనరల్‌గా చూస్తుంటాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఆ సంప్రదాయానికి చెక్ పెట్టారు. జననేతగా తనని గెలిపించిన జనం మధ్యలోనే ప్రమాణస్వీకారం చేస్తానని..జనాలే తనకి విఐపి అని
తేల్చేశారు.
జనం మధ్యలో ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయబోతోన్న కేజ్రీవాల్ మరో క్రేజీ విఐపికి మాత్రం ఇన్విటేషన్ పంపారు. అచ్చం కేజ్రీవాల్ గెటప్‌లో ఉన్న ఓ బుడ్డోడిని ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. సోషల్ మీడియాలో మినీ మఫ్లర్ మేన్‌గా పాపులర్ అయ్యాడు ఈ బుడ్డోడు. సోషల్ మీడియాలో ఆమ్ఆద్మీ షేర్ చేసిన ఈ ఫోటో ఆప్ విజయోత్సవాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది.
కొంతమందైతే ఏదో ఒకరోజు ఈ బుడ్డోడే సిఎం అవుతాడంటుండగా..కొంతమంది హి ఈజ్ సో క్యూట్..అంటూ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఆమ్ఆద్మీ కూడా మినీ మఫ్లర్ మేన్ క్రేజ్ గమనించి కేజ్రీవాల్ ప్రమాణ కార్యక్రమానికి బిగ్ గెస్ట్‌గా పిలిచేసింది.
ఆదివారం రామ్‌లీలా మైదాన్‌లో కేజ్రీవాల్ పదవీబాధ్యతలు చేపట్టనుండగా..కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్..ఎన్జీఓల ప్రతినిధులు 50 మంది..ప్రజలు కనీసం 50 వేల మంది హాజరవుతారని అంచనా…మొత్తం మీద సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో కేజ్రీవాల్ కొత్త సంప్రదాయానికి తెరలేపడంపై సోషల్ మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తోంది.