పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది ఆ ఇద్దరు యువతులే, గుంటూరు యువతి నగ్న వీడియోల కేసులో కొత్త కోణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరులో యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మూడేళ్లు నరకం చూసిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యువతిని వేధించిన వారిలో ఒక నిందితుడి తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారు కావడం ఈ కేసులో మరింత హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం బయటపడింది. వరుణ్‌, కౌశిక్‌ అనే ఇద్దరు యువకులను శనివారం(జూన్ 27,2020) దిశ స్టేషన్ పోలీసులు అరెస్టు చేయగా ఈ కేసులో మరో ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. వరుణ్ స్నేహితురాలు, కౌశిక్‌ సోదరికి వీడియోలు పంపగా అక్కడ నుంచి పోర్న్‌ సైట్ లో వీడియోలు అప్‌లోడ్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు యువతులపైనా కేసులు పెట్టేందుకు పోలీసులు యోచిస్తున్నారు.

ప్రేమ పేరుతో నమ్మించి నరకం చూపించారు:
సదరు యువకులు ఒకరి తర్వాత ఒకరు బాధిత యువతిని ప్రేమించినట్టు నమ్మించి, అశ్లీల వీడియోలు తీసి మూడేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నారు. మూడేళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని నమ్మించి మోసం చేసిన ఆ కీచకులన కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే వరుణ్ తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారు కావడంతో కేసుని నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

రేప్ చేసి వీడియోలు తీసి పోర్న్ సైట్ లో అప్ లోడ్:
గుంటూరు బీటెక్ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆ వీడియోలు తీసి పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేసి మూడేళ్లుగా బెదిరింపులకు గురిచేస్తున్న ఘటన సంచలనంగా మారింది. కేసు విచారణలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. నూడ్ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టిన ఈ కేసులో ఇద్దరు నిందితులు వరుణ్, కౌశిక్‌లతో పాటు మరో ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఏ1 వరుణ్ స్నేహితురాలు కాగా మరొకరు ఏ2 కౌశిక్ సోదరిగా గుర్తించారు. ఈ ఇద్దరు యువతులను రూమ్ మేట్స్‌గా గుర్తించారు. యువతికి సంబంధించిన వీడియో వీరి దగ్గరి నుంచే కౌశిక్ కు చేరి… అక్కడినుంచి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అయినట్టుగా గుర్తించారు.

వరుణ్ గర్ల్ ఫ్రెండ్ నుంచి కౌశిక్ సోదరికి చేరిన వీడియోలు:
వరుణ్ నుంచి అతనితో క్లోజ్ ఉండే స్నేహితురాలు యువతికి సంబంధించిన వీడియోని సేకరించింది. ఆమే కౌశిక్ సోదరికి ఆ వీడియోలు ఇచ్చినట్టు దిశ పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె దాన్ని కౌశిక్‌కి ఇవ్వడంతో.. అప్పటికే ఆమెపై ఆగ్రహంతో ఉన్న అతను దాన్ని ఇంటర్నెట్‌లో పెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఫోన్ కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ ఆధారంగా ఆ ఇద్దరు యువతులను పట్టుకునే పనిలో ఉన్నారు.

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వరుణ్, కౌశిక్:
మూడేళ్ల క్రితం ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బాధితురాలు ఇంజనీరింగ్ చదువుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వరుణ్ అనే యువకుడు స్నేహం పేరుతో ఆమెను నమ్మించాడు. ఓ రోజు తన ఫ్లాట్‌కి తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ దృశ్యాలను వీడియో కూడా తీశాడు. అప్పటినుంచి బాధితురాలు వరుణ్‌ని దూరం పెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెకు కౌశిక్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి ఆమె గురించి ఆరా తీశారు. అదే సమయంలో వరుణ్‌ గురించి వారికి తెలిసింది. ఆ యువతి క్యారెక్టర్ సరైంది కాదని చెప్పడానికి… వరుణ్ దగ్గర ఉన్న వీడియోలను సేకరించి కౌశిక్‌కి చూపించారు. అలా ఆమెతో పెళ్లి ప్రపోజల్‌ను కౌశిక్ వదులుకునేలా చేశారు. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు యువతులే కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వరుణ్ నుంచి వీడియోలు సేకరించి… కౌశిక్‌కి చేరవేసింది వారేనని పోలీసులు తాజాగా గుర్తించారు.

ప్రేమించిన యవతి దక్కలేదన్న కోపంతో పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేసిన కౌశిక్:
తాను ప్రేమించిన యవతి తనకు దక్కలేదన్న ఆగ్రహంతో కౌశిక్ ఆమె వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టాడు. అయితే కొద్దిరోజులకు ఆ వీడియోలను గుర్తించిన బాధితురాలు కుటుంబ సభ్యుల సాయంతో వరుణ్, కౌశిక్ కుటుంబాలతో మాట్లాడి వాటిని ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేసింది. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చీటింగ్ 420 పేరుతో ఆ వీడియోలు మరోసారి సర్క్యులేట్ అవడంతో బాధితురాలు షాక్ తింది. అంతేకాదు, తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండటం, వేధింపులకు గురిచేస్తుండటంతో ఈసారి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ ఐపీ అడ్రెస్ ఆధారంగా కేసును చేధించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వరుణ్, కౌశిక్‌లను అరెస్ట్ చేసి కేసులు బుక్ చేసిన పోలీసులు… ఆ ఇద్దరు యువతులు, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

నిందితులు బడాబాబుల పిల్లలు:
ఆ వీడియోలను మరొక వ్యక్తి ద్వారా సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఆ వీడియోలు అప్‌లోడ్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? తదితర విషయాలపై దిశ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు బాగా డబ్బున్న బడాబాబుల పిల్లలు. విచ్చలవిడి జీవనానికి అలవాటుపడి అకృత్యాలకు తెగబడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగ్న వీడియోలతో బాధితురాలని మూడేళ్లుగా బెదిరింపులకు గురిచేశారని.. తాము రమ్మన్న చోటుకి రాకపోతే వీడియోలు పోర్న్ సైట్‌లో పెడతామంటూ చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మరికొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశముంది.

Read: ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు