పోలీసులకు లొంగి పోయిన దేవరాజ్…..శ్రావణి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్‌ శ్రావణి సూసైడ్‌ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజ్‌రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్‌లోనే అతనిపై శ్రావణి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరో వైపు శ్రావణి సూసైడ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న దేవరాజ్‌ లొంగిపోవడంతో.. అతన్ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు. టిక్‌టాక్‌లో శ్రావణికి పరిచయమైన దేవరాజ్‌.. ఫోటోలు, వీడియోలతో శ్రావణికి బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇక దేవరాజ్‌ వేధింపులపై జూన్‌లోనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగానే శ్రావణి సూసైడ్‌ చేసుకుంది. ఆ కేసు వ్యవహారంలోనే సినీ నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. కేసు విచారణలో ఉండగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.బుల్లితెర నటి శ్రావణి డెత్‌ కేసులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. నటి మరణం వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జీవితం అర్దాంతరంగా ముగియడానికి ప్రేమే కారణమని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి మరణంలో దిగ్బ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ కేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సాయి, దేవరాజ్‌లు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. శ్రావణి సూసైడ్‌కు నువ్వంటే నువ్వే కారణమంటూ రచ్చ చేస్తున్నారు. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. దీంతో అసలు గుట్టువిప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ట్రయాంగిల్‌ స్టోరీ
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు క్రైమ్‌ థ్రిల్లర్‌కు మించిన సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఈ కేసులో ట్రయాంగిల్‌ ఫైట్‌ బయటపడుతోంది. శ్రావణి, దేవరాజు, సాయి మధ్య ట్రయాంగిల్‌ స్టోరీ జరిగినట్టు స్పష్టమవుతోంది. దీంతో ఈ కేసు ముడి విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టెలివిజన్ నటి శ్రావణి గత ఎనిమిదేళ్లుగా తెలుగు సీరియల్స్ నటిస్తోంది.

కెరీర్‌ సానుకూలంగా వెళ్తున్న సమయంలో కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్‌టాక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రేమికుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ క్రమంలో మంగళవారం సెప్టెంబర్8వతేదీ రాత్రి మధురా నగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజురెడ్డి అలియాస్‌ సన్నీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాకినాడకు చెందిన దేవరాజు.. టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తనకు అమ్మానాన్న ఎవరూ లేరని.. శ్రావణిని నమ్మించి దగ్గరయ్యాడు. శ్రావణి ప్లాట్‌లోనే దేవరాజు మకాం పెట్టాడు. పలుమార్లు ఆమె ప్లాట్‌ ఖాళీ చేయాలని కోరినా అతడు అక్కడే అంటిపెట్టుకుని ఉన్నట్టు తెలుస్తోంది.

READ  సైబర్ టవర్స్ కు 21 ఏళ్లు 

ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి నిజస్వరూపం తెలిసి.. దేవరాజును శ్రావణి దూరం పెట్టింది. అయితే తన మరణానికి ముందు దేవరాజ్‌ వేధింపుల విషయంలో శ్రావణి ఎస్‌ఆర్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతని నుంచి వేధింపులు అధికం కావడంతో శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురైంది.

నగ్న చిత్రాలు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా…..భార్యను బెదిరిస్తున్న సినీ రచయిత


ఎప్పుడైతే తనను శ్రావణిదూరం పెట్టిందో.. అప్పటి నుంచి దేవరాజు కక్ష పెంచుకున్నాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడు.తాను అడిగిన డబ్బు ఇస్తేనే వాటిని డిలీట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. గత్యంతరం లేక విడతల వారీగా దేవరాజుకు శ్రావణి నగదు కూడా పంపినట్లు తెలుస్తోంది. దేవరాజు నుంచి వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో.. జూన్‌లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆడియో క్లిప్పుల కలకలం
టీవీ ఆర్టిస్ట్ శ్రావణి మరో కోణం కూడా బయటకు వచ్చింది. సాయి అనే వ్యక్తి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితుడు దేవ్‌రాజ్ ఆరోపిస్తుంటే…… అదంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నాడు సాయి. శ్రావణి – దేవ్‌రాజ్ మధ్య జరిగిన సంభాషణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తాను చనిపోతే సాయి వల్లే అంటూ మొదటి ఆడియో క్లిప్‌లో శ్రావణి చెప్పినట్లుగా ఉంది.

ఇక రెండో ఆడియో క్లిప్‌లో మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడితో ఆపేద్దాం అంటూ శ్రావణి అంటుంటే…. తనతో స్పెండ్ చేయాలని.. మాట్లాడకుంటే జరిగే పరిణామాలకు తనకు సంబంధం ఉండదంటూ దేవ్‌రాజ్ శ్రావణిని బెదిరించడం వినిపిస్తోంది. ఇందులో దేవరాజ్‌ శ్రావణిపై బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.


మర్యాదగా వచ్చి తనతో గంట సమయం గడపాలని బెదిరించినట్టు ఆడియోలో ఉంది. తన దగ్గరికి రాకపోతే.. తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని హెచ్చరించాడు. దీనికి స్పందించిన శ్రావణి.. ఇంతటితో ఆపెయ్‌.. నీకు విశ్వాసం లేదు.. నాతో ఆడుకోకు దేవా అంటూ ప్రాధేయపడింది.

ఈ నేప‌థ్యంలో దేవ‌రాజు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని పోలీసుల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. సాయి అనే మ‌రో వ్యక్తి శ్రావ‌ణి వెంట‌ప‌డేవాడ‌ని, త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని వేధించేవాడ‌ని, పెళ్లి చేసుకోక‌పోతే.. చంపేస్తాన‌ని బెదిరించేవాడ‌ని, అందుకోసం ప్రయ‌త్నాలూ చేశాడ‌ని, త‌న వేధింపులు భ‌రించ‌లేకే.. శ్రావ‌ణి ఆత్మహ‌త్య చేసుకుంద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న ద‌గ్గర ఉన్నాయ‌ంటున్నాడు దేవరాజు.


ఇంతకీ ఈ సాయి ఎవ‌రు..? సాయికీ.. శ్రావ‌ణికి ఉన్న సంబంధం ఏమిటి ?
ఇంతకీ ఈ సాయి ఎవ‌రు..? సాయికీ.. శ్రావ‌ణికి ఉన్న సంబంధం ఏమిట‌న్న విష‌యంలో పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లెట్టారు. ఈ కేసు నుంచి త‌ప్పించుకోవ‌డానికి దేవరాజు సాయి పేరుని బ‌య‌ట‌కు తెచ్చాడా..? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

READ  ఛపక్.. నాక్ జాక్ వీడియో సాంగ్ రిలీజ్

శ్రావ‌ణి కాల్ డేటాని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. కాల్ రికార్డ్స్ ద్వారా ఈ కేసుని ఛేదించాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. మొత్తానికి శ్రావ‌ణి ఆత్మహ‌త్యలోనూ కొన్ని వెలుగు చూడ‌ని ర‌హ‌స్యాలు ఉన్నాయేమో అనిపిస్తోంది.అయితే దేవరాజురెడ్డి ఆరోపణలపై సాయి స్పందించాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్‌నని.. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశాడు. కాగా…..శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజు రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమని ఆరోపిస్తున్నారు. శ్రావణి సూసైడ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవరాజు రెడ్డిపై కేసు నమోదు చేశారు. .. ఆత్మహత్య గుట్టు విప్పేందుకు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో దేవరాజ్‌ రెడ్డి, సాయిని విచారిస్తే శ్రావణి మృతిపై చిక్కుముడి వీడే అవకాశం ఉంది.Related Posts