కరోనాలో మరో కొత్త లక్షణం.. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న సైంటిస్టులు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rare Coronavirus Symptom : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ రోజురోజుకీ మ్యుటేట్ అవుతోంది. కరోనా ప్రారంభంలో కనిపించిన లక్షణాలకు ఇప్పుడు కనిపించే లక్షణాలకు చాలా వ్యత్యాసం ఉంది.. చాలామందిలో కొత్త కరోనా లక్షణాలు పుట్టుకోస్తున్నాయి.. ఇప్పటివరకూ జ్వరం, నిరంతరాయంగా దగ్గడం, ఊపరి తీసుకోలేకపోవడం కరోనా లక్షణాలుగా చెప్పుకొంటూ వచ్చాం.. ఆ తర్వాత మరిన్ని కొత్త కరోనా లక్షణాలను గుర్తించారు పరిశోధకులు..ఇప్పుడు మరో అరుదైన కొత్త కరోనా లక్షణం భయాందోళనకు గురిచేస్తోంది.. అసలు ఈ లక్షణాన్ని చూసి ఎవరూ కూడా కరోనా వచ్చిందంటే నమ్మరు.. అంత సాధారణంగా ఉంటుందీ వైరస్ లక్షణం.. సైంటిస్టులు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

ఏం ఉందిలే అని నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు.. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ లక్షణమేంటో తెలుసా? పొత్తి కడుపులో నొప్పి.. సాధారణంగా కడుపు నొప్పి వస్తే.. పెద్దగా పట్టించుకోరు.. అదే పోతుందిలే అని వదిలేస్తుంటారు.

కడుపులో నొప్పా.. కరోనా లక్షణం కావొచ్చు :
కడుపునొప్పి వచ్చినా అనుమానించాల్సిందే.. అది కరోనా లక్షణం కావొచ్చునని గట్టిగా హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. వాస్తవానికి ఈ కొత్త కరోనా లక్షణం ఎక్కడ ఎలా గుర్తించారంటే.. ఆస్ట్రేలియాలోని క్యూన్స్ లాండ్‌లో గుర్తించారు.. ఓ నర్సుకు వచ్చిన కడుపునొప్పిని కరోనా లక్షణంగా నిర్ధారించారు. తరచూ కడుపు నొప్పి రావడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో ఆమెకు కూడా కరోనా టెస్ట్ చేశారు.. ఆ టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది.. డాక్టర్లు షాక్ అయ్యారు… కరోనా లక్షణాల్లో కడుపునొప్పి కూడా ఒకటిగా నిర్ధారించారు. ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా టెస్టింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నారు.కడుపులో నొప్పి అనేది.. కరోనా లక్షణమని నిర్ధారించడం ఇదే తొలిసారి కాదని నిపుణులు అంటారు.. గత మే నెలలో Royal College of Physicians ప్రచురించిన అధ్యయనంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో కోవిడ్ రోగుల్లో చాలామందిలో పొత్తికడుపులో నొప్పితో బాధపడ్డారని పేర్కొంది. కానీ, ఇందులో పాల్మనరీ లక్షణాలేమి లేవని నివేదించింది.

కరోనా సోకిన చాలామంది రోగుల్లో ఒకరికైనా కడుపులో నొప్పితో పాటు వికారం, డయేరియా లక్షణాలు కనిపించాయని రీసెర్చర్లు వెల్లడించారు. WHO ప్రకటించిన కరోనా వైరస్ సాధారణ లక్షణాల జాబితాలో చాలా తక్కువగా కనిపించే లక్షణంగా పేర్కొన్నారు.జూలైలో ది లాన్సెట్ ప్రచురించిన ఒక ప్రత్యేక అధ్యయనంలో కూడా ఇదే రుజువైంది.. UKలో 8మంది పిల్లల్లో ‘ఎటిపికల్ అపెండిసైటిస్’ లక్షణాలు కనిపించాయి.. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా వారికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.

READ  తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

మే నెలలో ఆరోగ్య అధికారులు వైద్యపరంగా అనోస్మియా అని పిలిచే వికారమైన లక్షణాన్ని నివేదించారు. కరోనావైరస్ లక్షణాల్లో అధికారిక జాబితాలో వాసన లేదా రుచిని కోల్పోయే లక్షణంగా చేర్చారు.

Related Posts