వాట్సాప్ కొత్త ఫీచర్ “Search the Web” యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తన ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారంతో పోరాడటానికి వాట్సాప్… కొత్త “Search the Web” ఫీచర్ ని తీసుకొచ్చింది. ఫార్వార్డ్ చేసిన మెసేజ్ ప్రామాణికమైనదేనా అని చెక్ చేయడానికి ఈ ఫీచర్ వినియగదారులను అనుమతిస్తుంది.యూజర్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అందుకున్నప్పుడు, వారు దాని పక్కన భూతద్దం చూస్తారు. వినియోగదారులు అందుకున్న కంటెంట్ గురించి వార్తల ఫలితాలను లేదా ఇతర సమాచార సోర్స్ ను కనుగొనడానికి భూతద్దం చిహ్నాన్ని నొక్కడం ద్వారా వెబ్‌లో శోధించవచ్చు.

వాట్సాప్ లేకుండా దాని మెసేజ్ ను చూడకుండా యూజర్లు తమ బ్రౌజర్ ద్వారా మెసేజ్ ను అప్‌లోడ్ చేయడానికి అనుమతించడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది.Search the Web ఫీచర్ ప్రస్తుతం బ్రెజిల్, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్, యుకె మరియు యుఎస్ లలో ఉంది. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్స్ .. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు వాట్సాప్ వెబ్ వెర్షన్లలో ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

నకిలీ వార్తలను ఎదుర్కోవటానికి ప్రవేశపెట్టిన కొత్త వాట్సాప్ ఫీచర్స్ జాబితాకు సెర్చ్ వెబ్ ఫీచర్ అదనంగా ఉంది. ఇంతకుముందు, కంపెనీ… “ఫార్వార్డ్” లేబుల్ మెసేజస్ ను ప్రవేశపెట్టింది. సందేశాలను ఫార్వార్డ్ చేయడానికి భారతదేశంలోని ఐదుగురు వినియోగదారులకు వాట్సాప్ యాప్ పరిమితిని కూడా నిర్ణయించింది.

సెర్చ్ వెబ్ ఫీచర్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదు.

Related Posts