mamata benarjee

మమత బెనర్జీ కొత్త సంవత్సరం కానుక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లోక్ సభ ఎన్నికలవేళ యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సు పెంచిన మమత

కొల్ కత్తా: కొత్త సంవత్సరంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ళనుంచి 65 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుని వారికి నూతన సంవత్సర కానుక అందించారు. అలాగే యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ల విరమణ వయస్సును65 నుంచి 70 ఏళ్లకు పెంచారు. రానున్నలోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మమత ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సోమవారం  కొల్ కత్తా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో  పాల్గోన్న ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన ఉద్యోగి పని చేయలేడని నేను అనుకోవటంలేదు, వారి అనుభవాలు,సేవలు విద్యార్ధులకుచాలా అవసరం అందుకనేవారి రిటైర్మెంట్ వయస్సుపెంచుతున్నానని చెప్పారు. విద్యాసంస్ధల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం28వేల కోట్ల రూపాయలను ఈ విద్యాసంవత్సరం ఖర్చు చేయనున్నట్లుఆమె తెలిపారు.  త్వరలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు,కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో బలహీనవర్గాల పిల్లల ఉన్నతవిద్యకోసం 200కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మమత ప్రకటించారు.   గత 7 ఏళ్లలో రాష్ట్రంలో 23 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని, రానున్నరోజుల్లో మరో 7 యూనివర్సిటీలు రానున్నాయని మమత  చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృధ్ధిలో భాగంగా జనవరి 10న నదియా జిల్లాలో కన్యశ్రీ విశ్వవిద్యాలయానికి మమతా బెనర్జీ శంకుస్ధాపన చేయనున్నారు.

Related Posts