త్వరలో అవతార్-2 షూటింగ్ ప్రారంభం, గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత

As New Zealand Lifts Lockdown, Film Avatar 2 To Resume Production There Starting Next Week

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. దానికి సీక్వెల్‌గా ‘అవతార్‌2’ సహా మరో మూడు చిత్రాలు వస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఇటీవలే న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్ డౌన్ సడలించింది. దీంతో అవతార్-2 షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మా అవతార్ సెట్స్ రెడీ అయ్యాయి. వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చెయ్యలేము. త్వరలో షూటింగ్ జరగబోయే సీన్ ఇదే అంటూ ఓ పెద్ద జెట్ బోటు పిక్ ని ఆయన ఇన్ స్టాలో షేర్ చేశారు.

వచ్చే వారం నుంచి అవతార్-2 షూటింగ్:
ఇటీవలే న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్ డౌన్ లో భారీ సడలింపులు ఇచ్చింది. సినిమా షూటింగ్ లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. న్యూజిలాండ్ లో షూటింగ్ ప్రారంభం కానున్న రెండు సినిమాల్లో ఒకటి అవతార్-2 కాగా మరొకటి లార్డ్ ఆఫ్ ద రింగ్స్. కరోనా వైరస్ కారణంగా మార్చి 22 నుంచి యావత్ ప్రపంచం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా షూటింగ్ లు కూడా బంద్ అయ్యాయి. తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో తిరిగి సినిమా షూటింగ్ లకు చిత్ర పరిశ్రమ రెడీ అవుతోంది. అవతార్-2 షూటింగ్ కు సంబంధించి నిర్మాత చేసిన పోస్టు సినీ ప్రేక్షకుల్లో ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడూ సినిమా చూస్తామని ప్రపంచవ్యాప్తంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

అవతార్-2, 3, 4,5:
2009లో వచ్చిన ‘అవతార్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అవతార్ సినిమాకు రెండు మూడు సీక్వెల్స్‌ సిద్ధం చేస్తున్నారు డైరెక్టర్ కామెరూన్‌. అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’ చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి వరుసగా డిసెంబర్‌ 17, 2021.. డిసెంబర్‌ 22, 2023న రానున్నాయి. ఇవి విజయవంతమైతే ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ చిత్రాలను పూర్తి చేయనున్నట్లు కామెరూన్‌ ప్రకటించారు. ఇంతకీ ఈ సీక్వెల్స్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా? ఒక బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ. సామ్‌ వర్దింగ్టన్‌, జోయ్‌ సల్డానా, కేట్‌ విన్స్‌లెట్‌, రిబ్సి, జోయల్‌ డేవిడ్‌ మూరీ, దిలీప్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

boat

2021 డిసెంబర్ 17న అవతార్-2 విడుదల:
మొదటి సీక్వెల్‌ ను 2021 డిసెంబర్‌ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ అయోమయంలో పడిపోయింది. షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల వల్ల ‘అవతార్‌’ ఆలస్యం అవుతుందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘‘అవతార్‌ అనుకున్న సమయానికే వస్తాడు’’ అని హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ సంచలన ప్రకటన చేశారు‌. ‘‘కరోనా వల్ల మా షూటింగ్‌ షెడ్యూల్‌ మొత్తం మారిపోయింది. అయినా సరే అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. చెప్పిన తేదీకే విడుదల చేయగలుగుతాం అనే అనుకుంటున్నా’’ అని ఇటీవలే చెప్పారు కామెరూన్‌.

Read: కరోనా కష్టం..పండ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు : మళ్లీ పాత వృత్తే దిక్కైంది

మరిన్ని తాజా వార్తలు