లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

మూణ్ణాళ్ల ముచ్చటైన ప్రేమ పెళ్ళి – గుండెపోటుతో భర్త, మనోవేదనతో భార్య మృతి

Published

on

newly married bride suicide due todepression at nellore district : తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు విధి ఆడిన వింత నాటకానికి బలి అయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారిజీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లైన మూడు నెలలకు గుండె జబ్బుతో భర్త చనిపోగా…మనోవేదనతో భార్య జనవరి7న గురువారం కన్నుమూసింది. ఈహృదయా విదారక విషాదగాధ నెల్లూరు జిల్లాలో జరిగింది.

జిల్లాలోని రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష(30)నగరంలోని జీజీహెచ్ లోకాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తోంది. ఆమెకు గూడురు అయ్యవారి పాళేనికి చెందిన జగదీష్ తో పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.పెద్దలను ఎదిరించి ప్రేమికులు ఇద్దరూగత సంవత్సరం అక్టోబర్ 29న ప్రేమ వివాహం చేసుకున్నారు.

సంతోషంగా సాగిపోతున్నవారి జీవితంలో పెళ్లైన రెండు నెలలకే విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్ లో భర్త జగదీష్ గుండె పోటుతో మరణించాడు. దీంతో శిరీష మనోవేదనకు గురైంది. ప్రేమించిన భర్త దూరం అవటం, కుటుంబసభ్యులు దగ్గరకు రానివ్వకపోవటంతోమానసికంగా కుంగి పోయింది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఒంటిరిగా ఉంటున్న ఆమె జనవరి 6వ తేదీన తనకు తోడుగాస్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 7వతేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష  స్నేహితురాలికి చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్నేహితులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఆస్పత్రికి వచ్చి మృతదేహానికి పంచనామా నిర్వహించిన పోలీసులు, మృతురాలి చేతులపై ఇంజెక్షన్లు చేసుకున్నట్లు గుర్తించారు. వైద్యులు  మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భార్యా, భర్తలు మరణించటం ఇరు కటుంబాల్లో విషాదం నింపింది.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *