లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అజారుద్దీన్-2 అతనే.. 37 బంతుల్లో 100పరుగులు కొట్టేసిన కేరళ పవర్ హిట్టర్

Published

on

Azharuddin: క్రికెట్ క్రేజ్ తో అతని పేరుకూడా మార్చేసుకున్నాడు. అజ్మల్ పేరు నుంచి మొహమ్మద్ అజారుద్దీన్ గా పెట్టేసుకున్నాడు. అంతేకాకుండా కేరళలోని తలంగరా నుంచి వచ్చిన అజ్మల్.. బుధవారం అతని ఏడుగురు బ్రదర్స్, సొంతూరు గర్వపడే విధంగా ఆడి రాష్ట్రం గర్వపడేలా చేశాడు.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆడిన అజ్మల్.. 37బంతులకే సెంచరీ.. 54బంతులకు 137పరుగులు చేశాడు. దేశీవాలీ క్రికెట్ లీగ్ సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ గేమ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 9ఫోర్లు, 11సిక్సులతో అలరించాడు. వేగవంతంగా సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్లు రిషబ్ పంత్ (32బంతులు), రోహిత్ శర్మ(35బంతులు) తర్వాత స్థానంలో నిలిచాడు అజారుద్దీన్.

మనం మాత్రమే కాదు.. అతని గ్రామం మొత్తం అందరూ టీవీ ముందే అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో అజారుద్దీన్ వీడియో క్లిప్పింగ్ లతో పాటు.. ఈ అజ్మల్ బ్యాటింగ్ వీడియోలు షేర్ అవుతున్నాయి.

ఇక అతని గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేశారు. వాహ్ అజారుద్దీన్, బెహతరీన్ ముంబై మీద అద్భుతంగా 54బంతులకు 137స్కోరు చేయగలిగాడు. ఇన్నింగ్స్ ఎంజాయ్ చేయగలిగాం’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

ఇండియా మాజీ ఫేసర్, కేరళ కోచ్ తినూ యొకోహన్నన్ మాట్లాడుతూ.. ‘అతని నుంచి ఇటువంటి ఇన్నింగ్స్ నే ఆశించాం. కానీ, ఈ రేంజ్ లో కాదు. అతని పికప్ బాగుంది. స్క్వేర్ లెగ్ షాట్స్ బాగా ఆడుతున్నాడు. చూడటానికి చక్కగా అనిపిస్తుంది కానీ, బౌలర్లకు మాత్రం ఇబ్బందే’

అతనికి ఉన్న ఏడుగురు సోదరులు క్రికెట్ ఆడుంటారు. వారంతా డిస్ట్రిక్ట్ లెవల్ ప్లేయర్లే. కోచెస్ అంతా అజారుద్దీన్ ను నేచురల్ స్ట్రోక్ ప్లేయర్ అనే అంటారట. ‘నాకు 25ఏళ్లు ఉన్నప్పుడు.. మిడిల్ ఈస్ట్ లో అతను పుట్టాడు. మా ఫ్యామిలీలోనే చిన్నవాడు. ఇటువంటి వాటికి దూరంగా ఉండమని చెప్పేవాళ్లం. కానీ, కలలను నిజం చేసుకోవడానికే ప్రయత్నించాడు’ అని కమరుద్దీన్ అన్నారు.

అజారుద్దీన్ వయస్సుతో సంబంధం లేకుండా ఆడుతుంటాడు. 15ఏళ్ల వయస్సులో కేరళ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అప్పుడే ఆయనకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఉండేదట.