బంగ్లా మహిళల అక్రమ రవాణా కేసులో NIA తొలి ఛార్జ్ షీట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bangladeshi human trafficking case : అంతర్జాతీయ బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడాది క్రితం అంతర్జాతీయ బంగ్లాదేశీ మానవ అక్రమ రవాణా ముఠాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 9 మంది బంగ్లాదేశీయులతో పాటు 12 మంది పేరును ఛార్జ్ షీటులో దాఖలు చేసింది.ఈ ఛార్జ్ షీటును ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. బంగ్లాదేశీ యువతులను బంగ్లా నుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు ఛార్జ్ షీటులో పేర్కొంది. నకిలీ ఇండియన్‌ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్‌ నుంచి యువకులను అక్రమంగా తరలిస్తోంది ఈ గ్యాంగ్.యువతులను గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కు చెందిన బితీ బేగం అనే మహిళ ఈ ట్రాఫికింగ్ రాకెట్‌లో ప్రధాన సూత్రాధారిగా గుర్తించారు. ముందుగా నగరంలోని పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు అయింది.ఆ తరువాత ఎన్‌ఐఏకు బదిలీ అయింది. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ వెల్లడించింది.

Related Posts