లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

పొలంలో పనిచేస్తున్న 43మంది కూలీల గొంతు కోసి చంపేసిన తీవ్రవాదులు

Published

on

Nigeria : Boko Haram militants kill 43 farmers : తీవ్రవాదుల ఘాతుకానికి 43మంది వ్యవసాయ కూలీలు బలైపోయారు. మానవత్వం మరచిని మృగాల్లా వ్యవహరించిన తీవ్రవాదుల దుశ్చర్యలకు కష్టజీవుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. పొలం పనిచేసుకుంటున్న 43మంది వ్యవసాయ కూలీలను తీవ్రవాదులు అత్యంత దారుణంగా చంపేసారు.రెక్కలు ముక్కలు చేసుకుంటేనే గానీ కడుపు నిండని కూలీలు పొలంలో పనిచేసుకుంటుండగా వారిని తీసుకెళ్లి చేతులు వెనక్కి విరిచి కట్టేసి గొంతులు కోసి చంపేసిన దారుణ ఘటన నైజీరియాలో బోకో హరమ్ చోటుచేసుకుంది.పొలంలో పనిచేసుకుంటున్న కూలీలను లాక్కెళ్లి ఊచకోత కోశారు తీవ్రవాదుల. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమపంలోని కోషోబ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ఇది అత్యంత భయానక ఘటన అని ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొన్నారు. బోకోహరమ్ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల కోసం తల్లికి..చెల్లికి విషం పెట్టి చంపిన యువకుడు
ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ దేశం ఈ ఘటనపై చింతిస్తోందన్నారు.తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు సామూహిక అత్యక్రియలు జరిగిన ఘటన కన్నీరు తెప్పించింది. కాగా హత్యకు గురైన 43మంది కూలీలతో పాటు మరో ఆరుగురు తీవ్ర గాయాలతో పడిఉన్నవారిని ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.కాగా తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారంతా వాయువ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. పనికోసం..పొట్ట చేత పట్టుకుని 1000 కిలోమీటర్లు వచ్చి పనిచేసుకుంటున్న కూలీలను తీవ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.స్థానిక రైతులు వరి పొలం కోయటానికి కాంట్రాక్టు బేరంమీద వీరిని తీసుకొచ్చారు. అలా వారు పొలంలో వరి కోస్తుండగా హఠాత్తుగా ఊడిపడ్డ తీవ్ర వాదులు వారిని లాక్కెళ్లి చేతులు కట్టేసి గొంతుకోసి చంపేశారు.వీరిలో 10మంది మహిళలు కూడా ఉన్నారు.మరో ఆరుగురు తీవ్ర గాయాలతో పడి ఉండగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *