Home » playboy : ఆరుగురు అమ్మాయిలతో డేటింగ్..ఒకేసారి గర్బం దాల్చిన యువతులు
Published
2 months agoon
By
nagamaniNigeria playboy Six girlfriends pregnant at the same time : అతనో విలాస పురుషుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకకాలంలో ఏకంగా ఆరుగురు అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. అదో విశేషమైతే..ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకేసారి గర్భం దాల్చారు. దీంతో తన మగతనానికి తానే తెగ మురిసిపోతున్నాడు ఆ ప్లేబోయ్. అంతటితో ఆగని ఆ విలాస పురుషుడు..తన ఆరుగురు ప్రియురాళ్లను వెంటేసుకుని ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయి హాట్ టాపిక్‌గా మారాయి.
నైజీరియాకు చెందిన విలాస పురుషుడు ప్రెట్టీ మైక్. తన ప్రియురాళ్లందరూ ఒకేసారి గర్భం దాల్చారని తెగ చెప్పేసుకంటూ తెగ గర్వంగా ఫీలైపోతున్నాడు. తన ఫ్రెండ్ పెళ్లికి తన ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టుకుని దర్పంగా వెళ్లాడు. దీంతో అందరికి కళ్లూ ప్రెట్టీ మైక్ మీద అతని ప్రియురాళ్లమీద నిలిచిపోయాయి. దీంతో ఆ పెళ్లిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు ప్రెట్టీ. ప్రియురాళ్లు సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోతుంటే..చుక్కల్లో చంద్రుడిలా ప్రెట్టీ పింక్ కలర్ సూట్లో మెరిసిపోయాడు. ధనవంతుడైన ప్రెట్టీ మైక్ ఓ క్లబ్ ఓనర్.. అతడి అసలు పేరు మైక్ ఈజ్ న్యావలే వోగ్.
ప్రెట్టీ మైక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లవర్స్ తో కలిసి వెళ్లిన ఫోటోలను షేర్ చేశారు. ‘ప్రెట్టీ మైక్.. అతని ఆరుగురు బేబీ మదర్స్.. ఇది ఫిల్మ్ ట్రిక్ కాదు.. మేము మా బెస్ట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాం అని తెలిపాడు.
ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్స్ ఫ్రెండ్స్ తో చేసిన విన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి చర్చనీయాంశమయ్యాయి. 33 ఏళ్ల ప్రెట్టీకి ఘనమైన ట్రాక్ రికార్డే ఉంది. 2016లో నైజీరియా రాజధాని చుట్టూ అమ్మాయిలతో సహా కుక్కలతో పరేడ్ నిర్వహించి నిర్వహించి వార్తల్లో నిలిచాడు. ఇలా వివాదాలతో వైరల్ అయ్యే ప్రెట్టీ తన సెక్స్ లైఫ్ గురించి కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో పెంచుకుంటుంటాడు. సెక్స్ లైఫ్ గురించి ఫాలోవర్లకు సలహాలు కూడా ఇస్తుంటాడు.
ఇక తన ఆరుగురు ప్రియురాళ్లు ప్రతి ఒక్కరికి ముద్దులు ఇస్తూ.. వారి పొట్టను రుద్దుతూ నడుస్తున్న విచిత్రమైన వీడియోను కూడా ప్రెట్టీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై ఓ ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలు వేస్తుంటే రెచ్చిపోయి మరీ సమాధానాలిస్తున్నాడు.
ప్రెట్టీకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం.అంత్యంత ఖరీదైన గూచీ, వెర్సేస్, డోల్స్ ,గబ్బానా వంటి కార్లు అంటే బాగా ఇష్టం. తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానంలో ఒకడు ఈ ప్రెట్టీ మైక్.. అలాగే అందమైన అమ్మాయిలు, కుక్కలకు గొలుసులు కట్టి వివాదంలో ఇరుక్కున్నాడు.
మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు సోషల్ మీడియాలో ఏకిపారేశారు. అలాగే ఓ మహిళా యాంకర్‌ను తన కుక్కతో పోల్చిన మైక్ విమర్శల్ని మూటకట్టుకున్నాడు. ఇలా వివాదం ఏదైనా ప్రెట్టీ మైక్ స్టైల్లో చేస్తుంటాడు.