లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘రైడర్’ గా రానున్న ‘యువరాజా’..

Published

on

Rider Teaser: మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు ‘యువరాజా’ నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న మూవీ ‘రైడర్’.. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం (జనవరి 22) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘రైడర్’ టీజర్ యాక్షన్ సీన్లతో నింపేశారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి.. నిఖిల్ ఫైట్స్ కోసం బాగా కష్టపడ్డాడు. కశ్మీరా పరదేశి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి అర్జున్ జ‌న్యా సంగీతం, శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చెయ్యనున్నారు.