ఎట్టకేలకు ‘నిశ్శబ్దం’ వీడి.. OTT లో..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Nishabdham Direct Digital Release: తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం/సైలెన్స్ చిత్రం యొక్క డైరెక్ట్ టూ సర్వీస్ ప్రపంచ ప్రీమియర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించింది.


కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణంలో, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మాటలురాని మరియు వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణి, ప్రముఖ-సంగీతకారుడైన ఆమె భర్త మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ అదృశ్యం అయిన అంశం పై ఈ చిత్రం ఉంటుంది.


గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో అనుష్క శెట్టి, ఆర్. మాధవన్ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, షాలిని పాండే, సుబ్బరాజు మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలను పోషించారు. మైఖేల్ మాడ్సన్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, కిల్ బిల్, రిజర్వాయర్ డాగ్స్) ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా పరిశ్రమకు అరంగేట్రం చేస్తున్నారు.


భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు అక్టోబర్ 2న విడుదల అవుతున్న ఈ చిత్రం యొక్క డిజిటల్ ప్రీమియర్‌ను ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.‘నిశ్శబ్దం’ ఫస్ట్ డే ఫస్ట్ స్ట్రీమ్ అక్టోబర్ 1 గురువారం రాత్రి 9:30 నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులోకి రానుండగా అక్టోబర్ 2 తెల్లవారు జామున 12 గంటల నుండి మలయాళ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

Related Posts