Nishabdham TEASER

అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ చూశారా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నవంబర్ 7 అనుష్క బర్త్‌డే సందర్భంగా బుధవారం ‘నిశ్శబ్దం’.. టీజర్ రిలీజ్ చేశారు..

స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు).. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. నవంబర్ 7 అనుష్క బర్త్‌డే సందర్భంగా బుధవారం ‘నిశ్శబ్దం’.. టీజర్ రిలీజ్ చేశారు..

తెలుగు టీజర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, తమిళ్, మలయాళ టీజర్స్ గౌతమ్ మీనన్, హిందీ టీజర్ నీరజ్ పాండే విడుదల చేయడం విశేషం. ‘అనుష్క, మాధవన్ హాలీడే టూర్‌కి వెళ్లడం.. అక్కడినుంచి రకరకాల సంఘటనలు జరగడం వంటివి టీజర్‌లో చూపించారు. అనుష్క కేవలం సైగల ద్వారా ఆకట్టుకుంది.. సినిమాలోని ప్రధాన తారాగణమంతా టీజర్‌లో కనిపించారు.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క పెయింటర్‌గా,  మాధవన్ మ్యుజిషియన్‌గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్‌గా కనిపించనున్నారు..

Read Also : డిస్కోరాజాలో బర్మా సేతుగా బాబీ సింహా

‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడిసన్ నెగెటివ్ క్యారెక్టర్ చేశారు.. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ లేదా 2020 జనవరిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.  తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, నిర్మాతలు : కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్. 

Related Posts