నాన్నా.. నవ్వుతోంది!.. నితిన్ పెళ్లి కానుకగా ‘రంగ్ దే’ టీజర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘నాన్నా… (అమ్మాయి) నవ్వుతోంది! నేను (తాళి) కట్టలేను నాన్నా!’ అని పెళ్లికి కొన్ని క్షణాల ముందు నితిన్‌ తలపట్టుకుని బాధపడ్డారు. అంతకు ముందు ఏడ్చారు కూడా! అయితే, అది నిజ జీవితంలో కాదు… ‘రంగ్‌ దే’లోని ఓ దృశ్యంలో! నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు. నితిన్‌ పెళ్లి సందర్భంగా ఆదివారం సినిమా టీజర్‌ విడుదల చేశారు.


Rang De

అందులో సరదా సంభాషణలు, టీజర్‌ చివర్లో పెళ్లి తర్వాత నేపథ్య సంగీతంలో వచ్చే ‘బతుకు బస్టాండే…’ సంగీతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ‘‘మా హీరో నితిన్‌కి అందమైన పెళ్లి బహుమతి ఇది. ప్రేమతో కూడిన ఈ కుటుంబ కథా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని ‘రంగ్‌ దే’ టీమ్‌ తెలిపింది.Rang De

‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కదా చిత్రం ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Related Posts