వైరల్ అవుతున్న నిత్యా మీనన్ లెస్బియన్ లిప్‌లాక్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోన్న నేప‌థ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను చేర‌డానికి మార్గాలు సుల‌భ‌మ‌వుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి మేక‌ర్స్ సరికొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఓటీటీలలో రోజురోజుకీ వెబ్ సిరీస్‌లకు ఏ స్థాయిలో ఆదరణ పెరుగుతుందో తెలిసిందే. సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్‌లకు బాగా అలవాటు పడ్డారు.

Abhishek Bachchan

ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్’కు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటివరకు వెండితెర మీద సంప్రదాయ పాత్రల్లో నటించి మెప్పించిన నిత్య ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం హాట్‌గా కనిపించింది. ఇందులో ఆమె లెస్బియన్‌గా నటించడం విశేషం.

Nithya Menen

అలాగే మరో యువతితో లిప్‌లాక్ కూడా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. వెండితెరపై నిత్యను సంప్రదాయ పాత్రల్లో చూసిన వారు ఈ సన్నివేశాలు చూసి షాకవుతున్నారు. నిత్య ఎలా చేసిందో మనం కూడా ఓ సారి చూద్దాం అంటూ ప్రైమ్ అకౌంట్ ఉన్నవాళ్ళు సదరు సన్నివేశాన్ని రిపీట్ చేసి మరీ చూస్తుంటే.. లేని వాళ్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Related Posts