Home » నితీష్ కే సీఎం సీటు…బీజేపీ క్లారిటీ
Published
2 months agoon
“Nitish Kumar Will Be Chief Minister, It Was Our Commitment”: BJP బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతరాని కమలదళం సృష్టం చేసింది. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమిలో జేడీయూ కన్నా అత్యధికంగా బీజేపీ 74 స్థానాలు గెల్చుకున్న విషయం తెలిసిందే. జేడీయూ కేవలం 43స్థానాల్లో విజయం సాధించి కూటమిలో జూనియర్ పార్టనర్ గా నిలిచింది.
గతంలో ఎప్పుడూ బీహార్ లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నితీష్ లేకుండా బీహార్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం కాషాయదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు గెల్చిన బీజేపీ.. నితీష్ స్థానంలో మరొకరిని సీఎం కుర్చిలో కూర్చోబెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలను కాషాయపార్టీ ఖండించింది.
నితీష్ వ్యూహమేంటి : 35ఏళ్లుగా MLAగా పోటీ చేయట్లేదు…5సార్లు సీఎం
నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని,అది తమ పార్టీ కమిట్ మెంట్ అని బీహార్ డిప్యూటీ సీఎం,బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. ఎన్నికల్లో కొందరు ఎక్కువ గెలువవచ్చు..కొందరు తక్కువ గెలువవచ్చు..కానీ మేము సమాన భాగస్వాములం అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. దీంతో 15ఏళ్లుగా బీహార్ సీఎం పీఠంపైనే కూర్చున్న నితీష్ కుమార్..మరో ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగనున్నరని క్లారిటీ వచ్చేసింది. దీంతో అతిత్వరలో నితీష్ ఐదవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125స్థానాల్లో విజయం సాధించగా, మహాకూటమి110 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక,బీజేపీ 74స్థానాల్లో విజయం సాధించింది. జేడీయూ 43స్థానాల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ 70స్థానాల్లో పోటీ చేసి 19స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వామపక్షాలు 16స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం అనూహ్యంగా 5స్థానాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక,ఎన్డీయే నుంచి బయటికొచ్చి సొంతంగా పోటీ చేసిన ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు 7చోట్ల విజయం సాధించారు.