లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు పెడితే జైలుకే…నితీష్ నిర్ణయంపై తేజస్వీ ఫైర్

Published

on

Nitish Kumar సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టుల పెట్టేవారిపై చర్యలకు ఆదేశిస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు, పరువునష్టం కలిగించే పోస్ట్‌లు పెడితే సైబర్ క్రైమ్ కింద చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు బిహార్ ఎకనమిక్ నేరాల నిరోధక విభాగం గురువారం ఆదేశాలు జారీచేసింది. సోషల్ మీడియాలో పోస్టుల విషయమై రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కార్యదర్శులకు ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ చీఫ్ నయ్యర్ హస్నైన్ ఖాన్ గురువారం ఓ లేఖ రాశారు. ప్రభుత్వం, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులపై సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు పరువు నష్టం కలిగించే, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయని వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.

అయితే, శుక్రవారం ఉదయం ఈ ఆదేశాలు వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీశ్‌ను హిట్లర్‌తో పోల్చారు. ఈ ఉత్వర్తుల కింద తనను అరెస్ట్ చేయాలని సీఎంకు తేజస్వీ సవాల్ విసిరారు. నితీశ్ కుమార్‌ను ‘అవినీతికి భీష్మ పితామహుడు’అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 60 కుంభకోణాలకు పాల్పడిన నితీశ్ కుమార్.. అవినీతికి భీష్మ పితామహుడు, నేరస్థుల రక్షకుడు.. అనైతిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వానికి బలహీనమైన నేత… బీహార్ పోలీసులు మద్యం విక్రయిస్తున్నారు.. ఈ ఉత్తర్వుల కింద నన్ను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా అని తేజస్వీ విరుచుకుపడ్డారు.

నిరసనకారులు తమ నిరసన తెలియజేయకూడదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే జైలుకు పంపుతున్నారు.. ప్రతిపక్ష నేతలకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి అనుమతించరు.. నితీశ్ జీ మీరు పూర్తిగా అలసిపోయారు, కానీ కొంత సిగ్గుగా ఉంది అని నితీష్ పై తీవ్రస్థాయిలో తేజస్వీ ఫైర్ అయ్యారు.

బీహార్ లో దాదాపుగా 3కోట్ల 93లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో 6కోట్ల 21లక్షలమందికిపైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు తరుచుగా ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేసేందుకు ఉపయోగించబడుతున్నాయని నితీష్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.