మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటం దక్కించుకున్న నిత్యా కొడాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Nitya kodali: తెలుగమ్మాయి నిత్యా కొడాలి మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటం దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీని WTCF వందకుపైగా తెలుగు ఆర్గనైజేషన్స్ తో కలిపి నిర్వహించింది. ఈ పోటీలో 40దేశాలకు పైగా పాల్గొన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు ఇండియా నుంచి కూడా పోటీదారులు ఉన్నారు.

15 సంవత్సరాల నిత్య కొడాలి అమెరికాలోని టెక్సాస్, హ్యూస్టన్ లో పుట్టారు. మనిషిగానే కాదు తెలివిలోనూ, మనసుతోనూ అందమేనని నిరూపించుకున్నారు. స్కూల్లో ఉన్న 800మంది స్టూడెంట్స్ లో 1ఫస్ట్ ర్యాంక్ సాధించారు.జాతీయ స్థాయిలో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు చేసిన ఆమె.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. చక్కటి తెలుగు మాట్లాడటమే కాకుండా, డ్యాన్స్ ట్యాలెంట్, తెలివితేటలు, కమ్యూనిటీ సర్వీస్, ర్యాంప్ వాక్, ప్రశ్న-సమాధానాలు అద్భుతమైన ప్రదర్శన చేసిన విజేతగా నిలిచారు.

nitya kodal

మొత్తం పాల్గొన్న 700మంది కంటెస్టంట్లలో తానా టీం నిత్యకు కిరీటం బహుకరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్ ఎర్త్ ఇండియా డా.తేజస్విని మనోజ్ఞ చేతుల మీదకు కిరీటాన్ని అందుకున్నారు.

nitya

Related Tags :

Related Posts :