లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

నా భార్యను తన భార్య అంటున్నాడు.. నేను చచ్చిపోతున్నా.. కార్పొరేటర్ భర్త సెల్ఫీ వీడియో! 

Published

on

Nizamabad corporator husband selfie video viral, alleged going to suicide 

నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యను ఎవరో వ్యక్తి తన భార్య అంటూ వేధిస్తున్నాడని కార్పొరేటర్ భర్త నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయాడు.

ఆకాష్ అనే వ్యక్తి నా భర్యను తన భార్యగా ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించాడు. నీ భార్యను తీసుకెళ్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నాడు. చంపేస్తానంటూ తరచూ బెదిరిస్తున్నాడని, ఆకాష్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానని, అందుకే తాను సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నానంటూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుందని కుటుంబ సభ్యులకు ఆ వీడియోను పంపాడు. ఆకాష్ పెట్టే టార్చర్ గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపాడు. నరేశ్  భార్య ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పొరేటర్ గా గెలుపొందారు. నరేశ్ సెల్ఫీ వీడియో ఆధారంగా అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.   

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *