లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌పై ‘యూనియన్ ఫ్లాగ్’ ఉండాల్సిందే

Published

on

Oxford Covid vaccine labelled with Union Flag : కరోనాను అంతం చేసే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే వందలాది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ రేసులో దూసుకెళ్తున్నాయి.అందులో Oxford-AstraZeneca అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ కోవిడ్ వాక్సిన్ కూడా ఒకటి. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో ఈ వ్యాక్సిన్ 90శాతం ప్రభావంతమని కంపెనీ ప్రకటించింది కూడా. ఇక రెగ్యులేటరీ నుంచి ఆమోదం ఒక్కటే ఆలస్యం.. యూకే ప్రభుత్వం టీకా కోసం ముందుగానే 100 మిలియన్ డోస్‌లను ప్రీ ఆర్డర్ చేసింది.

ఈ ఏడాది ఆఖరిలోగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు.. డౌనింగ్ స్ట్రీట్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘యూనియన్ యూనిట్’ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డోస్‌లపై యూనియన్ ఫ్లాగ్ ఫ్రింట్ లేబుల్ చేయాలంటూ పిలుపునిచ్చింది.స్కాటీష్ స్వాతంత్రం కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో యూకేను ప్రొటక్ట్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ డివిజన్ ఏర్పాటు చేశారు. యూనియన్‌ను ఎంతమాత్రం చెక్కుచెదరకుండా ఉండేందుకు నిరంతరం కృషి చేయాలని భావిస్తోంది.మరోవైపు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డోస్ లపై యూనియన్ ఫ్లాగ్ లేబుల్ చేయాలనే ఆలోచనను హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాన్ కాక్, బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ స్వాగతించారు. వ్యాక్సిన్ డోస్ లపై యూనియన్ ఫ్లాగ్ లేబుల్ చేయడం వల్ల సందేహించే వారిలో విశ్వాసాన్ని నింపినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.మరోవైపు.. డౌనింగ్ స్ట్రీట్.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డోస్ లపై యూనియన్ ఫ్లాగ్ లను లేబుల్ చేయడంపై ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. కానీ, ఫ్లాగ్ లేబులింగ్ ప్రతిపాదనను మాత్రం తోచిపుచ్చలేదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *