లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

దసరా అయిపాయె.. ఇక సంక్రాంతిపైనే ఆశలు

Published

on

Movie Theatres

సమ్మర్ హాలీడేస్ కు ధీటుగా సంక్రాంతి, Dussehra, దీపావళి వంటి రోజులు సినీ ఇండస్ట్రీకు బాగా అనుకూలమైన రోజులు. థియేటర్స్ బిజీబిజీగా ఉండే టైం అది. సినిమాలు ఆడితే లాభాలు ఓకే కానీ, పండగ రోజుల్లోనూ సందడి లేకపోతే ఇక చేసేదేముంటుంది. థియేటర్స్‌కు కరోనా వ్యాప్తి భయం పుట్టడంతో సమ్మర్‌ లో ఖాళీగా ఉండిపోయాయి. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవలే థియేటర్స్‌ రీ ఓపెన్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేరు. దసరాకి కూడా థియేటర్స్‌ బిజినెస్‌కు సందడి లేనట్టే.

థియేటర్స్ కు రాకుండా సినిమాల్లేవ్:

కొత్త సినిమా అయితేనే చూడటానికి థియేటర్స్‌కి వస్తారు. అలా వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేస్తాం అంటోంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. అప్పటివరకూ పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను నడిపిస్తున్నారు. వేళ్ల మీద లెక్కపెట్టేంతలా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈజీగా కొత్త రిలీజ్‌లు ఉండే సీజన్‌ దసరాకి ఈసారి ఒక్క రిలీజ్ కూడా లేకుండాపోయింది. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు రిలీజ్ అవుతాయో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. ఇప్పటికే సినిమా షూటింగులన్నీ మొదలైపోవడంతో ఇక రిలీజ్ కోసం సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే.



ఓటీటీల దసరా

థియేటర్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుండటంతో ఓటీటీకి బాగా డిమాండ్‌ పెరిగింది. థియేటర్స్‌ ప్రారంభించినప్పటికీ ఓటీటీలోనే కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ డైరక్షన్లో ‘నర్తనశాల’ అనే సినిమా అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల అది పూర్తి కాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించిన ప్రాజెక్టు కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్‌ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్‌హిట్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కి సీక్వెల్‌గా ‘మిర్జాపూర్‌ 2’ తాజాగా అమేజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. టబూ, ఇషాన్‌ కట్టర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్‌లో దసరా సందడి కనబడుతోంది.

సందడి మళ్లీ సంక్రాంతికేనా?

దీపావళి, క్రిస్మస్‌ సీజన్‌లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. సంక్రాంతికైనా థియేటర్లు కొత్త సినిమాలతో కళకళాలాడతాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *