లాక్ డౌన్ విధించే ఆలోచన లేదు – మధ్యప్రదేశ్ సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

No lockdown Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దీనికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదని, పాఠశాలలు, కళాశాలల మూసివేత మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.భోపాల్ లో జరిగిన ఈ సమావేశంపై కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చించారు. వైరస్ వ్యాపించకుండా..పకడ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు జిల్లాల అధికారులు విపత్తు నిర్వాహణ శాఖ వారితో సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడకుండా చూడాలని, వైరస్ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు, కార్మికులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, నిబంధనలు పాటిస్తూ..వివాహ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు.అయితే..పరిమిత సంఖ్యలో బంధువులు హాజరయ్యే విధంగా చూసుకోవాలని, ప్రజారవాణతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా కొనసాగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

Related Tags :

Related Posts :