లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కరోనా కాలర్ ట్యూన్ కట్..ఇక వ్యాక్సిన్ ట్యూన్

Published

on

Amitabh Bachchan Covid caller tune : కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాలర్ ట్యూన్ దేశమంతా మారు మ్రోగింది. ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. జాగ్రత్త వహించండి, అత్యవసరాల కోసమే మాత్రమే బయటకు వెళ్లాలి’…ఇలా ట్యూన్ వినిపిస్తుంది. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ అందించారు. అయితే..ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ మొదలై పోయింది. అంతేగాకుండా..కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో కరోనా కాలర్ ట్యూన్ మార్చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం నుంచి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపైనే ఫోన్ లో కొత్త కాలర్ ట్యూన్ స్వాగతం చెప్పనుంది.

కరోనా టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎవరికీ ఫోన్ చేసినా..కొత్త కాలర్ ట్యూన్ వినిపించనుంది. మహిళా స్వరంతో ఇధి ఉండనుందని తెలుస్తోంది. ‘కరోనా అంతానికి టీకా రూపంలో కొత్త సంవత్సరం ఓ కొత్త వెలుగును తీసుకొచ్చింది. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవి. అంతేగాకుండా ప్రభావింతమైనవి..మనదేశంలో తయారైన వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచడి..మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి, వదంతులు నమ్మొద్దు’ అనే వాయిస్ వినిపించనుంది. టీకా తీసుకున్న తర్వాత కూడా..మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలని కొత్త కాలర్ ట్యూన్ చెబుతుంది.

అయితే..కాలర్‌ ట్యూన్‌లో జాగ్రత్తలు చెప్పే అమితాబ్.. కరోనా బారిన పడ్డారని, ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారని ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా కాలంలో ఎంతో మంది సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలా మంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని ఆరోపించారు.