ఆ షాపుల్లో ఇక scotch దొరకదా? దిగుమతి వస్తువులపై కేంద్రం నిషేధం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

No more scotch in military shops : ఆ షాపుల్లో స్కాచ్ దొరకదా? మిలటరీ షాపుల్లో దిగుమతి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

400 మిలటరీ షాపుల్లో విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని ఓ నివేదిక వెల్లడించింది. విదేశీ లిక్కర్ సంస్థలైన Diageo, Pernod Ricard కంపెనీల మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి.భారత ఆర్మీ క్యాంటీన్లలో అమ్మే లిక్కర్ ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను డిస్కౌంట్ ధరకే సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అందిస్తున్నాయి. వార్షిక అమ్మకాలు 2 బిలియన్ డాలర్లతో భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చైన్స్ మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి.

అక్టోబర్ 19న రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ప్రత్యక్ష దిగుమతి వస్తువుల సేకరణ ఉండబోదని నివేదిక చెబుతోంది. 2020 మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చలు జరిపారు.దేశీయ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ, దీనిపై స్పందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు.కేంద్రం నిషేధించిన దిగుమతి వస్తువుల్లో ఏ ఉత్పత్తులపై నిషేధం వర్తించనుందో ఆదేశాల్లో పేర్కొనలేదు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. విదేశీ మద్యం కూడా నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉంది.

Related Tags :

Related Posts :