కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ పార్టీ పెట్టే ఆలోచన లేదన్న సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

CM KCR Sensational statements : టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై వస్తున్నవార్తలపై ఆయన స్పందించారు. పార్టీ పెట్టే ఆలోచన ఏమి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ పెట్టే ఆలోచనే ఉంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.సోమవారం (సెప్టెంబర్ 7) టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో తీసుకురాబోయే కొత్త రెవిన్యూ చట్టంపై కూడా సీఎం కేసీఆర్ సుదర్ఘీంగా మాట్లాడారు.దేశానికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని కేసీఆర్ చెప్పారు. నయా భారత్, గియా భారత్ ఏమీ లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని సీఎం సూచించారు. ఎల్లుండి కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెడతామని కేసీఆర్ తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. కొత్త చట్టంతో భూకబ్జాల విషయంలో దాదాగిరీ నడవదని కేసీఆర్ చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో అధికారం టీఆర్ఎస్‌దేనని అన్నారు. ఇప్పటికే గ్రేటర్ పై సర్వే నిర్వహించామని తెలిపారు. గ్రేటర్ లో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదని కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామమాత్రమేనని కేసీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీలో 100కు పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Related Posts