లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గాయాలతో సతమతమవుతోన్న టీమిండియా.. సిరిస్‌ను వణికిస్తోన్న ఇసుక మైదానాలు

Published

on

ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ శుక్రవారం గబ్బా స్టేడియంలో గాయంతో సతమతమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇండియా తుది 11మంది జట్టులో ఒకడు సైనీ. ఈ పర్యటన మొత్తం టీమిండియాకు గాయాల బెడద తప్పలేదు. మహమ్మారి ఎఫెక్ట్ ఇలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్లేయర్లు వర్క్ లోడ్ మేనేజ్ చేయడంలో విఫలమవడంతోనే గాయాల పాలు అవుతున్నారని అన్నారు.

కండరం గాయాలు ఓవర్ నైట్ లో జరిగేవి కావు. చిన్నగా మొదలై అవి పెద్దగా మారతాయి. ఇది లోడ్ పెరగడంతో పాటు.. కొన్ని కచ్చితమైన యాక్షన్స్ కారణంగా జరుగుతుంటాయి. రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీల గాయాలు ఎవరికైనా కామన్ గా జరుగుతాయి. మిగిలిన గాయాలు మాత్రం లోడ్ మేనేజ్‌మెంట్ వల్ల జరిగేవే’ అని రాంజీ శ్రీనివాసన్, 2011 వరల్డ్ కప్ కోచ్ చెప్పారు.

బుమ్రా గురించి తీసుకుంటే.. 2019 వరల్డ్ కప్ తర్వాత వెన్నునొప్పితో బాధపడి తప్పుకుని మళ్లీ ఆడింది ఈ సిరీస్ లోనే. ఐపీఎల్ 60ఓలర్వు బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాతో 3వన్డేలకు, టెస్టు మ్యాచ్ లలో 117.4ఓవర్లు ఆడాడు.

అది కూడా ఇంటి నుంచి నాలుగు నెలల వరకూ బయటకు అడుగుపెట్టకుండా ఉండి.. ఇండియా బౌలింగ్ అటాక్ లో లీడర్ గా నిలిచాడు. నాలుగు నెలలుగా నెట్స్‌లో, మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ బ్యాట్‌ను కరెక్ట్‌గా టార్గెట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.

లాక్‌డౌన్ రూల్స్ ఎత్తేయడంతో క్రికెటర్లకు ఒక్కసారిగా వచ్చిన షెడ్యూల్ కు పూర్తిగా సెట్ కాలేకపోతున్నారు. అంతకంటే ముందు సహకరించినట్లుగా డై ఇన్, డే అవుట్ మ్యాచ్ లకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లాక్ డౌన్ సమయంలో మీరు ట్రైనింగ్ అయినా అది కాంపిటీటివ్ లెవల్ కాదు. కాంపిటీషిన్ విషయానికి వచ్చినప్పుడు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరెంత ట్రైన్ అయ్యారనేది విషయం కాదు. టోర్నమెంట్ కు శరీరం అలవాటు పడితేనే అంతా సెట్ అవుతుంది అని ఫిజియోథెరిపిస్ట్ నిఖిల్ లతే అంటున్నారు.

లాకౌ డౌన్ అయిన వెంటనే ఐపీఎల్ మొదలుపెట్టారు. ఆ టోర్నమెంట్ ఆడిన ప్లేయర్లు గ్యాప్ తీసుకోకుండానే ఆస్ట్రేలియా టూర్ కు బయల్దేరారు. ఈ సమయంలో ఫిట్‌నెస్‌తో ఉండటం చాలా ముఖ్యం. క్రికెట్ అనేది ఓ రన్నింగ్ గేమ్. లాక్‌డౌన్‌ నుంచి నేరుగా రావడంతో బౌలర్లు ఎక్కువగా గాయాలకు గురవుతున్నారు.

ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్ లో గాయాలవడానికి అవకాశమెక్కువ. ఫీల్డింగ్ లో ఉన్నప్పుడు ఒకే చోట నిల్చొని ఉన్నట్లు కనిపిస్తుంది కానీ, అటు ఇటూ పరిగెడుతూనే ఉండాలి. అలా చేయడం వల్ల గాయాల బెడద ఎక్కువ అవుతుంది. ఇండియన్ ప్లేయర్లు లోడ్ మానిటర్ చేయడంలో సరిగ్గానే ఉంది. కాకపోతే ఎక్కడో చిన్న లింక్ మిస్ అవుతుంది. లోడ్ మానిటరింగ్ లోనే సమస్య వచ్చింది.. ఐపీఎల్ ట్రైనర్లు ఏం చేశారు. అని శ్రీనివాసన్ ప్రశ్నిస్తున్నారు.