No tax benefits on rent paid, home loan: Should you buy a house or stay on rent in new tax regime?

HRA బెనిఫిట్స్ : అద్దెంట్లో ఉండలా? కొత్త ఇళ్లు కొనాలా? తేల్చుకోండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వేతన జీవులకు పన్ను మినహాయింపు (80C) అనేది ఒక ఆయుధం లాంటింది. పన్ను చెల్లింపులపై మినహాయింపు పొందేందుకు అలోవెన్సులపై ఆధారపడుతుంటారు. తమ ఖర్చులను చూపించి పన్ను మినహాయింపులను పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. 80C వర్తించే పాత పన్నువిధానం కింద వేతనపరులకు ఎంతో ఊరటను కలిగించేది. కానీ, ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్నిఅమల్లోకి తీసుకురావడంతో పన్ను మినహాయింపులపై కోత పడింది. ఈ రెండు పన్ను విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకోండి అంటూ మెలిక పెట్టింది.

40 శాతం నుంచి 50 శాతంగా :
కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ఎలాంటి పన్ను ప్రయోజనాలు వర్తించవని, మొత్తం పన్ను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పేసింది. ఈ రూల్.. వేతన జీవులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ వేతన జీవులంతా హౌస్ రెంట్ అలోవెన్స్ (HRA)పై పన్ను ప్రయోజనాలను పొందుతున్నారు. ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వారంతా హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు పొందుతున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం HRAపై వారి కనీస జీతంపై 40శాతం నుంచి 50 శాతంగా పన్ను మినహాయింపు పొందుతున్నారు. 

ఈ బెనిఫెట్ పొందేందుకు చాలామంది వేతనపరులు తమ సొంత ఇంట్లో కానీ లేదా పేరంటల్ ఇంట్లో ఉన్నా లేదా అద్దెంట్లో ఉంటున్నప్పటికీ వారు చెల్లించే అద్దెలపై బిల్లులను చూపించి పన్ను ప్రయోజనాలను పొందుతున్నారు. కానీ, కొత్త పన్ను విధానం ప్రకారం.. అద్దె ఇంట్లో ఉన్నా లేదా మీ బంధువుల ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తున్నట్టుగా చూపించినా పన్ను మినహాయింపు వర్తించదు. అయితే, ఇకపై అద్దె ఇంటికి బదులుగా సొంత ఇల్లు కొనడమే ఉత్తమం అని అనుకుంటున్నారా? అయినప్పటికీ మీకు పన్ను ప్రయోజనాలు వర్తించవు.

హోం లోనుపై రూ.2 లక్షలు :
హోం లోను తీసుకుని సొంతంగా ఇళ్లు కొనుక్కొని దానిపై అసలుతో పాటు వడ్డీ చెల్లిస్తుంటే వారికి కూడా పన్ను మినహాయింపు వర్తించదు. పాత పన్ను విధానం కింద వేతనజీవులు లేదా వేతనయేతర వారంతా ఆర్థిక సంవత్సరంలో హోం లోనుపై రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందచ్చు. ఉదాహరణకు ( ఒక ఇళ్లు కొనుగోలు చేసేందుకు రూ.3.5 లక్షలు హోం లోన్ ఉంటే..) హోం లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ పై తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ. 1.5 లక్షల లోపు పన్ను ప్రయోజనం పొందచ్చు.

కొత్త విధానంలో నో బెనిఫిట్స్.. 
అదే.. కొత్త పన్ను విధానంతో మీరు అద్దె ఇంట్లో ఉన్నా లేదా హోం లోన్ ద్వారా సొంత ఇళ్లు కొనుగోలు చేసినా ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న… పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? అని గందరగోళానికి గురవుతున్నారు. పాతది ఎంచుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు వర్తిస్తాయి.. కొత్తది ఎంచుకుంటే ఏ ప్రయోజనాలు వర్తించవు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్లాబ్ రేట్లలో మార్పులు మాత్రమే చేసింది ప్రభుత్వం… ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయాన్ని బట్టి పన్నురేటులో మార్పులు చేసింది. 

READ  ఏపీలో ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ లేదు!

రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు :
ప్రస్తుత రోజుల్లో హోం లోన్ అనేది అతిపెద్ద పన్ను ఆదా మార్గంగా చెప్పవచ్చు. 80C ఆదాయ పన్ను చట్టం కింద మందుస్తు చెల్లింపులు, ఈఎంఐల ద్వారా లోన్ అసలు అమౌంట్ తిరిగి చెల్లిస్తే రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. హోం లోన్ వడ్డీ మొత్తంపై కూడా ఐటీ చట్టంలోని సెక్షన్ 24B కింద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

మొదటిసారి ఇళ్లు కొన్నవారు కూడా సెక్షన్ 80EEA కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు అయితే వారికి రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వారు కొన్న ప్రాపర్టీ రూ.45 లక్షల కంటే తక్కువగా ఉండి 645 చదరపు అడుగుల విస్తీర్ణం (మెట్రో నగరాల్లో) 968 చదరపు అడుగులు ఇతర ప్రాంతాల్లో ఉండి తీరాలి. అప్పుడే రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. 

కొత్త పన్ను విధానంలో ఇలాంటి పన్ను ప్రయోజనాలు ఏమి వర్తించవు. మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే తక్కువ పన్ను రేటు పడుతుంది. అదే పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే మాత్రం పన్ను మినహాయింపులు పొందొచ్చు..కానీ, అధిక మొత్తంలో పన్నురేటు చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసినా చెల్లించాల్సిన మొత్తంపై పెద్దగా మినహాయింపు ఉండదనే చెప్పాలి..

కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్ భారీగా పెంచేశారు కదా.. అందుకే పన్ను ప్రయోజనాల కోసం ఆశపడి పాత పన్ను విధానం ఎంచుకుంటే అధికంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. దీనికంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవడమే మంచింది అంటున్నారు విశ్లేషుకులు.. ఇందులో అయితే పన్ను మొత్తం చెల్లించాల్సి వచ్చినా కూడా పన్ను రేటు తక్కువగా ఉంటుంది కదా? అని అభిప్రాయపడుతున్నారు. మీరే డిసైడ్ చేసుకోండి.. పన్ను విధానం పాతదా? కొత్తదా? అద్దె ఇంట్లో ఉండాలా? సొంత ఇల్లు కొనాలో ఏది కావాలో మీరే తేల్చుకోండి..  

Related Posts